- అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
- కలవడానికి వెళితే అరెస్టులా..‘బండి’
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి5: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులకు కలపాలని, లాంగ్ జంప్ను పాత పద్ధతిలోనే నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నెల రోజులుగా న్యాయం కోసం నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయం ముందట ధర్నాలు నిర్వహించినా, అధికారులకు వినతి పత్రం అందించినా పట్టించుకోవడం లేదని అన్నారు.
కోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రగతిభవన్ వద్ద ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అరెస్టు చేసిన యువ మోర్చా కార్యకర్తలు, పోలీసు పరీక్షా అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎంను కలవడానికి వెళితే బీజేవైఎం, పోలీస్ పరీక్ష అభ్యర్థులపై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసు రిక్రూర్మెంట్ పరీక్షల్లో ఉన్న అసంబద్ధ నిబంధనలు మార్చాలని మొరపెట్టుకున్నా విరకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరీక్షా నిబంధనను మార్చాలని తానే స్వయంగా సీఎం గారికి లేఖ రాసినా స్పందించలేదని విమర్శించారు. 2 లక్షల మంది పోలీస్ అభ్యర్థుల విన్నపాన్ని వినే సమయం సీఎంకు లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. వీళ్ళ బాధలు వినలేనంత తీరిక లేకుండా సీఎం ఏం ఘనకార్యం చేస్తున్నారని విమర్శించారు. బీజేవైఎం కార్యకర్తల పట్ల విచక్షణా రహితంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలన్న బండి సంజయ్.. వెంటనే పోలీసు పరీక్షల్లోని నిబంధనలను సవరించి అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. పరీక్ష రాసిన వేలమంది రోడ్డు దకు రావలసిన పరిస్థితి ఎందుకొచ్చిందో సీఎం అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పోలీసు రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు.
శారదాపీఠాన్ని దర్శించుకున్న బండి సంజయ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి