Take a fresh look at your lifestyle.

సునీల్‌ ఆత్మహత్యకు నిరసనగా… రాష్ట్ర వ్యాప్తంగా బిజెవైఎం, యూత్‌ ‌కాంగ్రెస్‌ ఆం‌దోళనలు

  • వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌
  • ‌కెసిఆరే కారణం..సిఎం కెసీఆర్‌పై కేసు నమోదు చేయాలి
  • వీడియోను మరణ వాంగ్మూలంగా స్వీకరించాలి
  • యూత్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సిఎం దిష్టిబొమ్మ దగ్ధం

సునీల్‌ ‌నాయక్‌ ఆత్మహత్యకు నిరసనగా శనివారం బీజేవైఎం ఆందోళనకు దిగడంతో హైదరాబాద్‌ ‌కలెక్టరేట్‌ ‌దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బారికేడ్లను తోసుకుని కార్యకర్తలు గేట్‌ ఎక్కే ప్రయత్నం చేశారు. సునీల్‌నాయక్‌ ‌కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించే వరకు ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. సునీల్‌ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వారు ఆరోపించారు. ఇక నిరుద్యోగులను ఆదుకునేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బిజెవైఎం కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. కలెక్టరేట్ల ముందు ధర్నాలకు దిగారు. దీంతో పలు జిల్లాల్లో ఉద్రిక్తత ఏర్పడింది.

కెసిఆరే కారణం..సిఎం కెసీఆర్‌పై కేసు నమోదు చేయాలి
నిరుద్యోగి సునీల్‌ ఆత్మహత్యకు కేసీర్‌ ‌సర్కార్‌ ‌కారణం అని, సునీల్‌ ‌చివరి వీడియోను మరణ వాంగ్మూలంగా స్వీకరించాలని, లేదంటే యువజన కాంగ్రెస్‌ ‌జైల్‌ ‌భరో చేపడుతుందని యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు హెచ్చరించారు. యువత ఎవ్వరు అఘాయిత్యాలకు పాల్పడవద్దంటూ అంబర్‌పేట్‌లో కేసీఆర్‌ ‌దిష్టిబోమ్మ దగ్ధం చేశారు. హైదరాబాద్‌ ‌యువజన కాంగ్రెస్‌ అధ్యక్షడు మోత రోహిత్‌ ‌బోడ సునీల్‌ ‌నాయక్‌ ‌మృతికి రాష్ట్ర సర్కారే కారణమని ఆరోపించారు. వెంటనే కేసీఆర్‌ ‌పై కేసే నమోదు చేయాలని హైదరాబాద్‌ ‌యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోత రోహిత్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. లేదంటే యువజన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైల్‌ ‌భరో కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మను అంబర్‌పేట్‌ 6‌నెంబర్‌ ‌చౌరస్తా వద్ద దగ్దం చేయడానికి ప్రయత్నించారు. దీంతో కొద్దసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

చివరకు యువజన కాంగ్రెస్‌ ‌నేతలు కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఈ సందర్భంగా మోత రోహిత్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం, యువతకు ఉపాధి వంటి వాటిపై కేసీఆర్‌ ‌దున్నపోతు మిద వర్షం పడినట్లు వ్యవహరిస్తున్నది ఆరోపించారు. సర్కార్‌ ‌నిర్లక్ష్య ధోరణి వల్లే బోడ సునీల్‌ ‌నాయక్‌ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సునీల్‌ది ఆత్మహత్య కాదని ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని అభివర్ణించారు. చనిపోయే ముందు సునీల్‌ ‌విడుదల చేసిన వీడియోను చివరి వాంగ్మూలంగా స్వీకరించి కేసీఆర్‌పై కేసు నమోదు చేసి డిమాండ్‌ ‌చేశారు. లేదంటే యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జైల్‌ ‌భరో కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది యువత ప్రాణాలు ఆర్పిస్తే వచ్చిన తెలంగాణలో ఉద్యోగాల కోసం మళ్లీ ఆత్మహత్యలు జరగడం బాధకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్లే యువత ప్రాణాలు విడుస్తున్నారని తెలిపారు.

యువత ఎవ్వరు అలా ఆత్మహత్యలకు పాల్పడవద్దని…. మి పక్షాన పోరాటం చేసేందుక యువజన కాంగ్రెస్‌ ‌సిద్దంగా ఉందని వివరించారు. అమరుల త్యాగాలపై అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ‌శవాల మివ పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన కుటుంబంలో నలుగురికి పదవులు ఇచ్చిన కేసీఆర్‌.. ‌రాష్ట్రంలో ఉన్న యువత గురించి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వొస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మిన యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు.

Leave a Reply