- నేతలకు పార్టీనేత బిఎల్ సంతోష్ దిశానిర్దేశం
- రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ పలు సూచనలు
- 119 నియోజకవర్గాలకు పాలక్‌ల నియామకం
- శేరిలింగంపల్లికి కిషన్ రెడ్డి, మేడ్చల్‌కు ఎంపీ లక్ష్మణ్
- కుత్బుల్లాపూర్‌కు డీకే అరుణ, పరిగికి విజయశాంతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది. బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ నాయకత్వం పాలక్‌లను నియమించింది. ఇందులో కనీసం 90 అసెంబ్లీ స్థానాలను బిజెపి టార్గెట్ చేస్తుంది. బీజేపీ అధిష్టానం సూచన మేరకు పాలక్ సభ్యులు నెలలో మూడు రోజులపాటు నియోజక వర్గాల్లోనే ఉండనున్నారు. నియోజకవర్గాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్‌లుగా నియమించారు. ఈ నేపథ్యంలో వీరందరికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు సూచనలు చేశారు. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు.
దేశానికి బీజేపీ తప్ప మరో పార్టీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఫుల్ టైమర్స్ వి•టింగ్ రెండోరోజు గురువారం కూడా కొనసాగుతుంది. శావి•ర్ పేటలోని ఓ రిసార్ట్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు, ఇంచార్జీలు, విస్తారక్‌లు, పాలక్‌లతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తరుణ్ చుగ్, బండి సంజయ్, లక్ష్మణ్, ఇతర బిజెపి నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన కార్యచరణపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబపాలన గురించి ప్రజలకు వివరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రణాళిక రూపొందించారు.
119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లుగా ముఖ్య నేతలను నియమించింది. నెలలో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు పాలక్‌లు. నియోజకవర్గాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్‌లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. శేరిలింగంపల్లి పాలక్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మేడ్చల్ పాలక్‌గా ఎంపీ లక్ష్మణ్, కుత్బుల్లాపూర్‌కు డీకే అరుణ పాలక్‌గా నియమితులయ్యారు. జుక్కల్ నియోజకవర్గానికి వివేక్ వెంకటస్వామిని పాలక్‌గా నియమించారు. ఎల్లారెడ్డికి రఘునందన్, రామగండం, మహబూబ్ నగర్‌ల పాలక్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పఠాన్ చెరుకు మురళీధర్ రావు, చేవెళ్లకు జితేందర్ రెడ్డి, పరిగికి విజయశాంతి, ఇబ్రహీంపట్నంకు ప్రకాశ్ రెడ్డి, సిరిసిల్లకు రాణీరుద్రమ, మెదక్ కు ధర్మపురి అర్వింద్ తో పాటు ముఖ్య నేతలకు పాలక్ లుగా బాధ్యతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించింది.