
230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కి 114 మంది ఎమ్మెల్యేలు, బిజెపికి 107 మంది ఉన్నారు. నలుగురు స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా ఉండగా.. ఒక ఎస్పీ, ఇద్దరు బిఎస్పి శాసనసభ్యులతో సహా ఏడుగురు సభ్యులు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. ఒక బిజెపి ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణించిన నేపద్యంలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 25 కోట్ల రూపాయలు నుంచి 35 కోట్ల రూపాయలు వరకు బీజేపీ ఆఫర్ చేసినట్టు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇప్పటికిప్పుడు 5 కోట్ల రూపాయలు ఇచ్చి.. మిగిలినవి రాజ్యసభ ఎన్నికల తరువాత వాయిదాలుగా మరికొన్ని కోట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని పడవేసే మద్దత్తు ఉపసంహరించుకునే అవిశ్వాస తీర్మానం ఇచ్చినాక మిగతా డబ్బు ఇస్తామని, కాంగ్రేస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేస్తున్నట్టు దిగ్విజయ్ సింగ్ ఆరోపిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్.. కర్ణాటక కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరూ అమ్మకానికి లేరు అని దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమాజ్‌వాదీ పార్టీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను మధ్యప్రదేశ్ నుంచి తీసుకువచ్చి గుర్గావ్ మౌర్య శరటన్ హోటల్ లో బీజేపీ పెట్టినట్లు రూమర్. ఈ విషయం మీద పది గంటలకు దిగ్విజయ్ సింగ్ ప్రెస్ మీట్ పెడతారు.
Tags: BJP, bargaining,Madhya Pradesh,Congress,MLAs,Rs 35 Crore Offer