- కార్యకర్తలపై లాఠీఛార్జి, అరెస్టు
- మద్యం, డబ్బులు పంచుతున్నార అని ఆరోపణ
- సిపికి ఫిర్యాదు చేసిన ఎంపీ అరవింద్
నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 41 డివిజన్లో బిజెపి టిఆర్ఎస్ కార్యకర్తలు మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది టిఆర్ఎస్ కార్యకర్తలు 41 డివిజన్ లో ఓటర్లకు డబ్బులు మద్యం డబ్బులు పంచుతున్నారు అని ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి వచ్చిన రూరల్ ఎస్సై ప్రభాకర్ త్రీ టౌన్ ఎస్ఐ సంతోష్ కార్యకర్తలను ఇక్కడి నుండి వెళ్లి పొమ్మని చెప్పిన బీజేపీ కార్యకర్తలు టి ఆర్ ఎస్ కార్యకర్తలు మద్యం డబ్బులు పంచుతున్నారు అని అంతేకాకుండా 20వ డివిజన్లో ఎమ్మెల్సీ ఆకుల లలిత పోలింగ్ బూతు లోకి వెళ్లి కారుకు ఓటు వేయాలని చెబుతున్నారు అని ఆరోపించారు. కానీ ఇరువర్గాల వారు వెళ్లకపోవడంతో లాఠీఛార్జి చేశారు. బిజెపి కార్యకర్తకు గాయం కావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను పంపించేందుకు పోలీసులు లాఠీచార్జి నిర్వహించారు అక్కడ నుండి కొంత మంది కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినారు. ఇట్టి విషయం తెలుసుకున్న నిజాంబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ సిపి కార్తికేయ కు ఫిర్యాదు చేశారు. అనంతరం 41 డివిజన్ వెళ్లి అక్కడ ఉన్న ఏసిపి శ్రీనివాసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఎంపీ అరవింద్ మా కార్యకర్తలు ఏమి తప్పు చేశారని అరెస్ట్ చేశారని ఏసీపీ తో వాగ్వాదానికి దిగారు. అరెస్టు చేసిన కార్యకర్తలు తక్షణమే విడుదల చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు. ఎంపీ అరవింద్ వెంట బిజెపి రాష్ట్ర నాయకులు బస్వ లక్ష్మీనరసయ్య కార్యకర్తలు ఉన్నారు.