Take a fresh look at your lifestyle.

రూట్‌ ‌మార్చిన కారు!

  • దుబ్బాక బై ఎలక్షన్‌ ‌పోరులో బిజెపి వర్సెస్‌ ‌టిఆర్‌ఎస్‌
  • ‌కారు ముందర సవా ‘లక్ష’ ముందస్తు వ్యూహాలు
  • అందుకే బిజెపిని టిఆర్‌ఎస్‌ ‌టార్గెట్‌ ‌చేసిందా?
  • మారుతున్న గు‘లాబీ’వ్యూహం..అందరి టార్గెట్‌ ‌హరీష్‌రావే?
  • కాంగ్రెస్‌ను పట్టించుకోని టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల నేతలు

దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్‌ ‌వెలువరించలేదు. అయితే, బీహర్‌ ఎన్నికలతో పాటే ఈ ఉప ఎన్నిక జరుగుతుందన్న ప్రచారం సర్వత్రా వినిపిస్తున్నది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుండగా…అధికార  టిఆర్‌ఎస్‌కు దుబ్బాక ఉప ఎన్నిక కత్తి మీద సాములా మారింది. దుబ్బాకలో మెరుగైన ఫలితాలు సాధిస్తే… వచ్చే సంవత్సరం జరగనున్న హైదరాబాద్‌ ‌గ్రేటర్‌(‌జిహెచ్‌ఎం‌సి)మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉండటమే కాకుండా… 2023లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది రెఫరెండం అని అన్ని పార్టీలు భావిస్తుండటంతో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఉప ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో, అన్ని పార్టీలు అక్కడ పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. అన్ని పార్టీలకంటే అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మాత్రం ఈ ఉప ఎన్నికలో గెలవడం అత్యంత ప్రతిష్టాత్మకం. దీంతోనే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతను పార్టీ అధిష్టానం పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు అప్పగించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తె•లంగాణలో వరుస విజయాలతో దూసుకొస్తున్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణాంతరం మాత్రం పార్టీకి పరిస్థితి అనుకూలంగా లేదన్న సంకేతాలు వెలువడినప్పటికీ…ట్రబుల్‌ ‌షూటర్‌ ‌హరీష్‌రావు రంగంలోకి దిగడంతో ఇప్పుడు దుబ్బాక అధికార పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లుగా రాజకీయ వర్గాలో చర్చ సాగుతున్నది. ఇదిలా ఉంటే,  దుబ్బాకలో మెరుగైన ఫలితాలు సాధిస్తే.. ఆ ప్రభావం వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లోనూ ఉంటుందని కేంద్రంలోని అధికార బిజెపి పార్టీ  భావిస్తుండగా.. జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికను టిఆర్‌ఎస్‌ ‌పార్టీ  కేవలం గెలుపుతో సరిపెట్టుకోకుండా లక్ష వోట్ల  మెజార్టీతో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌వ్యూహం మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇందుకు ప్రధాన కారణం దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ ‌నేతలు కాంగ్రెస్‌ ‌కంటే ఎక్కువగా బిజెపిని టార్గెట్‌ ‌చేస్తుండటమే. టిఆర్‌ఎస్‌ ‌నేతలు, ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ట్రబుల్‌ ‌షూటర్‌, ఆర్థిక మంత్రి హరీష్‌రావు… కాంగ్రెస్‌ ‌కంటే ఎక్కువగా బిజెపినే టార్గెట్‌ ‌చేస్తున్నారు. బాయికాడ కరెంటు మీటర్లు రావొద్దన్నా..విదేశీ మక్కలు రావొద్దన్నా.. మార్కెట్‌ ‌యార్డులు రద్దు కావొద్దన్నా.. దుబ్బాక నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిని లక్ష వోట్ల మెజారిటీతో గెలిపించి బిజెపి  అభ్యర్థికి డిపాజిట్‌ ‌గల్లంతు చేయాలని ప్రతి సభలోనూ పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా బాయికాడ కరెంటు మీటర్ల అంశాన్ని హరీష్‌రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒక అస్త్రంగా మలుచుకున్నట్లు స్పష్టంగా కొట్టొచ్చినట్లు అగుపిస్తున్నది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. టిఆర్‌ఎస్‌ ‌తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత ఉండొచ్చనీ ప్రచారం జరుగుతుండగా.. బిజెపి  తరపున దుబ్బాక రఘునందన్‌ ‌రావు ఉంటారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఆయన  నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక సమస్యలు, పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండటంతో… తనదైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపిగా పోటీ చేసి ఓడిన రఘునందన్‌రావుకు ఈ దుబ్బాక బై ఎలక్షన్‌ ‌చాలా ప్రతిష్టాత్మకం. దీంతో  తన మాట తీరుతో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మల్లన్నసాగర్‌ ‌నిర్వాసితులను టిఆర్‌ఎస్‌ ‌మోసం చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు బిజెపి పార్టీయే  ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ  విజయం సాధించకపోయినా.. అధికార టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా అత్యంతమైన విశ్వసనీయవర్గాలు గురువారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి.  అలా చేయగలిగితే.. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనే భావన కలిగించవచ్చని కమలనాధుల యోచనగా తెలుస్తుంది. దుబ్బాకలో మెరుగైన ఫలితాలు సాధిస్తే.. ఆ ప్రభావం వచ్చే ఏడాది జరగబోయే జి••చ్‌ఎం‌సీ ఎన్నికల్లోనూ ఉంటుందని బిజెపి నేతలు భావిస్తుండగా…దుబ్బాకలో బిజెపిని నిలువరించగలిగితే.. జి••చ్‌ఎం‌సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని దెబ్బకొట్టొచ్చనే భావనలో టిఆర్‌ఎస్‌  ‌నాయకత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే దుబ్బాకలో కాంగ్రెస్‌ ‌కంటే ఎక్కువగా బిజెపిని టార్గెట్‌ ‌చేస్తోందనే టాక్‌ ‌వినిపించడమే కాకుండా…తాజాగా గురువారం రాయపోల్‌లో జరిగిన ఒక సమావేశంలోనూ మంత్రి హరీష్‌రావు ప్రసంగమంతా బిజెపి లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. హరీష్‌రావు బిజెపిని మాత్రమే టార్గెట్‌ ‌చేస్తూ విమర్శలు గుప్పిస్తోంటే..బిజెపి నేత రఘునందన్‌ ‌రావు టిఆర్‌ఎస్‌తో పాటు మంత్రి హరీష్‌రావును లక్ష్యంగానే చేసుకుని  మాటల దాడిని కొనసాగిస్తున్నారు.

అందరీ టార్గెట్‌ ‌హరీష్‌రావే?
హరీష్‌రావు దూకుడు గమనించిన విపక్ష పార్టీలు.. మంత్రిని లక్ష్యంగా  చేసుకుని విమర్శలు మొదలుపెట్టాయి. సిద్ధిపేటను అభివృద్ధి చేసినట్లు దుబ్బాకను ఎందుకు అభివృద్ధి  చేయలేదని ప్రశ్నలు సంధిస్తున్నారు. లెక్కలు బయటపెడుతున్నారు నాయకులు. ఫేస్‌ ‌వాళ్లది బేస్‌ ‌హరీష్‌రావుది అని మాటల తూటాలు పేలుస్తున్నాయి. దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ ‌గెలిస్తే.. పరాయి పెత్తనం తప్పదని ఆరోపిస్తున్నాయి విపక్ష పార్టీలు. ఈ మధ్య కాలంలో హరీష్‌రావు కొందరు సర్పంచ్‌లకు ఫోన్లు చేసి మంచి చెడ్డలు ఆరా తీశారు. ఆ ఫోన్‌కాల్స్‌ను సైతం రికార్డ్ ‌చేసి వాటిని హరీష్‌కు వ్యతిరేక ప్రచారానికి వాడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. హరీష్‌రావు తనకు అప్పగించిన పనిని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. పైగా హరీష్‌కు ఏ బాధ్యత అప్పగించినా తూ.చ తప్పకుండా పూర్తి చేస్తారని.. విజయం సాధిస్తారని పార్టీలో టాక్‌.

‌పాపం కాంగ్రెస్‌…
‌దుబ్బాక రాజకీయం రణరంగాన్ని తలపిస్తున్నా.. అక్కడ కాంగ్రెస్‌ ‌జెండానే కనిపించడం లేదు. ఓ వైపు అధికార పార్టీ తరపున మంత్రి హరీష్‌రావు ఏకంగా గ్రామాల్లో గంపగుత్తగా తీర్మానాలు చేయిస్తూ దూసుకెళ్తున్నారు. మరోవైపు బిజెపి తరపున రఘునందన్‌రావు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, కాంగ్రెస్‌ ‌నుంచి మాత్రం అలికిడే లేకుండాపోయింది. అసలు దుబ్బాకలో ఆ పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్నట్లుగా ఆ పార్టీ నేతల తీరుంది. పైగా దీనికి తగ్గట్టే టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల మధ్య మాత్రమే డైలాగ్‌ ‌వార్‌ ‌నడుస్తోంది. అసలు కాంగ్రెస్‌ అనే పార్టీ ఒకటి పోటీలో ఉందనే విషయాన్ని వారు గుర్తించడం లేదు. ఇందుకు కారణం కూడా ఉంది. అది ఇప్పటివరకు దుబ్బాక బరిలో కాంగ్రెస్‌ ‌తరపున నిలబడే అభ్యర్థిని ఖరారు చేయకపోవడమే.  మొత్తానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ‌రాకుండానే  దుబ్బాక రాజకీయం వేడెక్కడంపై జనాల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది.

Leave a Reply