సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో శుక్రవారం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని తలపెట్టింది. అందులో భాగంగా బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నాయకత్వంలో దాదాపు 60 మంది బిజెపి అర్బన్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పోలీసుల నిర్బంధాలు చేదించుకొని గన్ పార్క్ ముందు నుండి అసెంబ్లీ ముందుకు ప్లా కార్డస్ ప్రదర్శిస్తూ చేరుకున్నారు. ఆందోళన, గందరగోళం, కార్యకర్తల తీవ్ర ప్రతిఘటన మధ్య రావు పద్మ, నేతలను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ బిజెపి ప్రజాస్వామ్యయుత నిరసనలను సర్కార్ అప్రజాస్వామికంగా అడ్డుకునేందుకు యత్నిస్తోందన్నారు.
నిజాం నియంతల వ్యవహరిస్తున్న కెసిఆర్ ఎంఐఎం పార్టీ నాయకుల మేపు కోసం విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అర్బన్ జిల్లా నాయకులు గురుమూర్తి శివ కుమార్, కొలను సంతోష్ రెడ్డి, దేశిని సదానందం గౌడ్, అమర్నాథ్ రెడ్డి, వినోద్, కందగట్ల సత్యనారాయణ, మండల సురేష్, పాషీకంటి రాజేంద్ర ప్రసాద్, మండల సురేష్, సిద్దం నరేష్, జన్ను మధు, పుల్యలా రవీందర్ రెడ్డి, కుచన క్రాంతి, నాంపల్లి శ్రీనివాస్, రాంకీ యాదవ్, అనిశెట్టి రంజిత్, పృథ్విరాజ్ గౌడ్, దులం నగేష్, కొంకా భాస్కర్, జడల రమేష్, బైరీ హరీష్,బోయిని శ్రీనివాస్, తిప్పని నాగరాజు, బసనబోయిన అఖిల్, జన్ను వీరేశ్, తదితరులు పాల్గొన్నారు.