Take a fresh look at your lifestyle.

హాల అమలులో బిజెపి వెనకడుగు

  • ప్రజల దరికి చేరని పథకాలు
  • వైఫల్యాలను  సక్షించుకోవాల్సిందే

న్యూదిల్లీ,జనవరి25: ప్రజలు సంపూర్ణ సాధికరాత  సాధించేలా దేశంలో పథకాలు అమలు కావడం లేదు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. విద్య విలాసవస్తువుగా మారింది. ఇలాంటి అసమనాతలను రూపుమాపేందుకు పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాలి. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు వారసత్వంగా వచ్చిన సకల అవలక్షణాలు ప్రజలను ఇంకా దరిద్రంలోనే ముంచెత్తుతున్న వేళ పాలకులు గతాన్ని నెమరేసుకుని ముందుకు సాగాల్సిన వేళ ఇది. దేశంలో ఇప్పటికీ సరైన ప్రజారోగ్య వ్యవస్థ లేదు. వ్యవసాయరంగం కుంగి కృషించిపోతోంది. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆహార ధాన్యాలకు మద్దతు ధరలు అందడం లేదు. విద్య మిధ్యగా మారింది. ఉద్యోగాల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. ఈ అసమానతల తొలగింపునకు రాజకీయ సంకల్పం బలంగా ఉండాలి.

ధనరాజకీ యాలను మార్చాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో నిజాయితీపరులు రావాలి. దేశమంటే అంకితభావం ఉన్న వారి చేతుల్లో పాలన ఉండాలి. అప్పుడే మనం మారుతాం. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే సంస్క•తికి చరమగీతం పాడకపోతే పెనుముప్పు రాగలదని ప్రజలు కూడా గుర్తించాలి. అప్పటి వరకు గణతంత్రాలు ఎన్నయినా మార్పు రాదు. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ ఎనిమిదేళ్లలో ఇచ్చిన హాలను అమలు చేసే సంకల్పం లోపించింది. ప్రధానంగా ధరల పెరగుదల విషయంలో పట్టింపు లేకుండా పోయాయి. ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతున్నా వాటికి ధరలు దక్కడం లేదు. గోదాముల్లో ధాన్యం మగ్గుతున్నా బయటకు రావడం లేదు. అలాగే దిగుమతులు కూడా తగ్గడం లేదు. కాంగ్రెస్‌ ‌తరహా రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఆదర్శ రాజకీయాలకు పెట్టింది పేరయిన బిజెపి ఇప్పుడా ముసుగు నుంచి బయటపడింది.

ఇటీవలి పరిణామాలు కుటిల రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవాలి. బిజెపి లాంటి పార్టీ ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల సహజంగానే దానికున్ని ఇమేజ్‌ ‌కాస్తా కరిగిపోయేలా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మసకబారినా, ప్రధానంగా బిజెపికి రాజకీయాలకు చెరగని మచ్చని తెచ్చి పెట్టాయి.  పాలన ఎలా ఉన్నా అవినీతి రహితంగా సాగుతుందన్న ప్రచారం ఊదరగొడుతున్నారు.  అవినీతి లేకున్నా అక్రమ రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ ‌తరహా రాజకీయాలకు పెద్ద ఎత్తున తెరతీసారు. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేలా చేసుకున్నారు. అయితే పాలనలో మాత్రం అంతగా దూసుకుని పోవడం లేదు. ప్రధానంగా నోట్లరద్దు, జిఎస్టీతో ప్రజలకున్న ఆశలు అడియాశల య్యాయి. అమిత్‌షా, మోడీ ద్వయం తమ కనుసన్నల్లో పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారు.  కాంగ్రెస్‌ ‌విముక్త భారత్‌ ‌లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలు ఒక్కోసారి వెగటుగా ఉంటాయనడానికి ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా చెప్పుకోవాలి.

కాంగ్రెస్‌ ‌పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోలేం. గవర్నర్‌ ‌వ్యవస్థ అభాసుపాలవుతోంది.  మిగతా నాయకులకు, మిగతా పార్టీలకు, భారతీయ జనతా పార్టీకి చెందిన మోదీ,షాలకు కూడా తేడా లేదని ప్రజలు గుర్తించారు. ఈ క్రమంలోనే తప్పటడుగులు వేస్తున్నారు. దేశమంతటా అన్ని రాష్టాల్రలో భారతీయ జనతాపార్టీ పతాకం రెపరెపలాడా లన్నది ఈ ఇరువురి నాయకుల కోరిక! ఈ కారణంగానే ఇప్పుడు దక్షిణాదిపై దృష్టిపెట్టారు.  కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు నీతి వాక్యాలు వల్లె వేస్తోంది గానీ దేశ రాజకీయాలు ఇవ్వాళ ఇంతలా భ్రష్టుపట్టిపోవడానికి ఆ పార్టీనే ప్రధాన కారణం. గతంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా అనేక అడ్డదారులు తొక్కింది. రాష్టాల్రలో అధికారం నిలబెట్టుకోవడం కోసం లేదా అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడం కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ చేయని అరాచకం లేదు.ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరహా రాజకీయాలనే నడుపుతున్నారు.  పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో గానీ, ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో గానీ కాంగ్రెస్‌ ఎప్పు‌డూ ముందుండేది. ఇప్పుడు అదే పంథాను బిజెపి అనుసరిస్తోంది. మొత్తంగా బిజెపి కాంగ్రెస్‌కన్నా భిన్నం కాదని తేలిపోయింది.

Leave a Reply