Take a fresh look at your lifestyle.

రాష్రానికి బిజెపి మొండిచెయ్యి

  • వరంగల్‌ అభివృద్ధికి చేసిందేమీ లేదు
  • మోడీతో దేశానికి, రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు
  • నల్లధనం తెచ్చి ఖాతాల్లో వేస్తానని మోసం
  • అభివృద్దిలో తెలంగాణ టాప్‌
  • ‌వరంగల్లో రోజూ నీళ్లిస్తామన్న హామి నెరవేర్చాం
  • వరంగల్‌ ‌పర్యటనలో మంత్రి కెటిఆర్‌
  • పలు అభివృద్ధి కార్యమ్రాలకు శ్రీకారం

‌కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. వరంగల్‌ అభివృద్ధికి బీజేపీ చేసిందేమి లేదన్నారు. నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ మాట ఏమైందని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు కాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపిస్తుందన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు సిలిండర్‌ ‌ధర రూ. 440 ఉంటే ఇవాళ రూ. 1000కి వచ్చిందన్నారు. ఇవి మంచి రోజులు కాదు.. చచ్చే రోజులు అని కేటీఆర్‌ ‌విమర్శించారు. మోదీ హయాంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడంతో కూరగాయల ధరలు కూడా పెరిగాయన్నారు. రైతులకు ఎరువుల ధరలు కూడా పెంచారు. కేంద్రానికి గత ఆరేండ్లలో రూ. 2 లక్షల 73 వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించాం. మనకు కేంద్రం ఇచ్చింది రూ. లక్షా 40 వేల కోట్లు మాత్రమే అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. సోమవారం వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏమైందని నిలదీశారు. వరంగల్‌లో రూ.2,500 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. నిధుల కొరతతోనే డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఆలస్యమవతుందన్నారు. వరంగల్‌ను గ్లోబల్‌ ‌సిటీగా మారుస్తామన్నారు. ఏడాదికి రూ. 300 కోట్లు ఇస్తున్నామన్నారు. వరంగల్‌కు మోనో రైల్‌ ‌తీసుకొస్తామని చెప్పారు. త్వరలో జరగబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ ‌ప్రజలకు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు త్వరలోనే కొత్త రేషన్‌ ‌కార్డులు, పెన్షన్లు అందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా కేసీఆర్‌ ‌తమ నాయకుడు అని భారీగా ప్రజలు తరలివొచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వరంగల్‌ ‌ప్రజల ఆశీర్వాదం సీఎం కేసీఆర్‌కు ఉండాలన్నారు.

వరంగల్‌ ‌పట్టణ అభివృద్ధి కోసం సంవత్సరానికి రూ. 300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఒక్క మంచినీటి కోసం రూ. 1,580 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాంపూర్‌ ‌వద్ద మిషన్‌ ‌భగీరథ వాటర్‌ ‌ట్యాంకును ప్రారంభించుకున్నామని తెలిపారు. రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తామన్నారు. వరంగల్‌ ‌నగరాన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తమది అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారని, చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నిక ఏదైనా కేసీఆరే మా నాయకుడు అని ఇప్పటి వరకు ఎలా తీర్పు ఇచ్చారో.. రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఆ రకమైన తీర్పును ఇవ్వాలని కేటీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిందన్నారు. కానీ సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా.. అమలు చేస్తున్నామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నాం…
పెన్షన్ల విషయానికి వస్తే.. టీడీపీ హయాంలో రూ. 75 అయితే, కాంగ్రెస్‌ ‌హయాంలో రూ. 200 ఇచ్చారు. కానీ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో రూ. 2016 ఇస్తున్నాము అని తెలిపారు. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వును, సంతోషాన్ని చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. వికలాంగులకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రూ. 500 ఇస్తే.. ఇప్పుడు రూ. 3016 ఇస్తున్నామ న్నారు. ఒకనాడు ఇంట్లో ఎంత మంది ఉన్నా.. 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేవారు. కానీ తమ ప్రభుత్వం పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్‌ ‌బియ్యం ఇస్తున్నాం. ఇది పేదల ప్రభుత్వం. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఆడపిల్లలు పుడితే రూ. 13 వేలు, మగబిడ్డ పుడితే రూ. 12 వేలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సర్కారు హాస్పిటళ్లల్లో నాణ్యమైన సేవలు అందుతున్నాయి.

మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. వెయ్యికి చేరువలో గురుకుల పాఠశాలలు నెలకొల్పి 4 లక్షల 50 వేల మంది నాణ్యమైన విద్యను అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థి, విద్యార్థిని వి•ద సంవత్సరానికి రూ. లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఓవర్సీస్‌ ‌స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని గుర్తు చేశారు. కరెంట్‌ ‌కష్టాలను అధిగమించాం. ఎండాకాలం వచ్చిందంటే ఆరు నుంచి ఏడు గంటలు పవర్‌ ‌కట్‌ ఉం‌టుండే. కేసీఆర్‌ ‌సీఎం అయ్యాక ఒక్క సెకను కూడా కరెంట్‌ ‌పోవట్లేదు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యేలు వినయ్‌ ‌భాస్కర్‌, ‌రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
త్వరలో వరంగల్‌ ‌కార్పోరేషన్‌ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పలు అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్‌ శ్రీ‌కారం చుట్టారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే కీలకమైన రోజూ మంచి నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం వరంగల్‌ ‌నగర పర్యటనలో భాగంగా లక్ష్మీపురంలో రూ. 24 కోట్లతో నిర్మించిన అత్యాధునిక సవి•కృత మార్కెట్‌ను, రూ. 6.24 కోట్లతో నిర్మించిన ఆదర్శ కూరగాయల మార్కెట్‌ను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఎల్బీనగర్‌లో నిర్మిస్తున్న షాదీ ఖానా, మండి బజార్‌లో నిర్మిస్తున్న హజ్‌ ‌హౌజ్‌ ‌పనులకు శంకుస్థాపన చేశారు. రూ.60 కోట్లు నిధులతో పూర్తిచేసిన ఆర్‌వోబీ, రు. 7.8కోట్ల నిధులతో అండర్‌ ‌బ్రిడ్జికి సమాంతరంగా నిర్మించిన నూతన బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. అంతకుముందు వరంగల్‌ ‌తూర్పు నియోజకవర్గ పరిధిలో డబుల్‌ ‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్‌ ‌బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు. ఉదయం రాంపూర్‌ ‌గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 8 లక్షల లీటర్ల మిషన్‌ ‌భగీరథ వాటర్‌ ‌ట్యాంక్‌ను కేటీఆర్‌ ‌ప్రారంభం చేశారు.

వాటర్‌ ‌ట్యాంకు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్‌ ‌వీక్షించారు. ఆయన వరంగల్‌ ‌పర్యటనలో భాగంగా మొత్తంగా రూ.2 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. కేటీఆర్‌ ‌వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ‌ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, ‌చీఫ్‌విప్‌ ‌దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, ‌నన్నపునేని నరేందర్‌, ‌చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య ఉన్నారు. కేటీఆర్‌ ‌క్వాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. వరంగల్‌ ‌పోచమ్మకుంట వద్ద కార్యకర్తలు కేటీఆర్‌ ‌కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లారు. ఇటీవల కేయూలో ఆత్మహత్య చేసుకున్న సునీల్‌ ‌కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply