Take a fresh look at your lifestyle.

బండి సారథ్యంలో ఉరకలేస్తున్న రాష్ట్ర బిజెపి

భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రస్థానాన్ని కరీంనగర్‌ ‌నగర కార్పొరేషన్‌ ‌కార్పొరేటర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, యంపి ఎన్నికల్లో విజయ కేతనమెగరేసి పార్లమెంట్లో అడుగుపెట్టి, తెలంగాణ రాష్ట్ర బిజేపి రథసారథి బాధ్యతలు చేపట్టి వరుస ఎన్నికల్లో అధికార పార్టీని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఫలితాలను సొంతం చేసుకుని భవిష్యత్‌ ఎన్నికలను విజయ సోపానాలుగా  చేసుకుంటున్నారు   తెలంగాణ రాష్ట్ర బిజెపి అధీప్తి బండి సంజయ్‌ ‌కుమార్‌. ‌జయాపజయాలు రుచి చూస్తూ పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు. కరీంనగర్‌లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన బండి నర్సయ్య, శకుంతల  దంపతులకు   11 జూలై 1971న ఆయన జన్మించారు. కరీంనగర్‌ ‌సరస్వతీ శిశు మందిర్‌ ఉన్నత పాఠశాలలో 1986లో 10వ తరగతి ఉత్తీర్ణులయ్యారు. 12వ ఏటనే ఆర్‌ ఎస్‌ ఎస్‌ ‌లో కార్యకర్తగా చేరి దేసభక్తి ఇనుమడింపజేసుకున్నారు. కరీంనగర్‌ ‌ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌, ‌డిగ్రీ పూర్తి చేసి, మధురై కామరాజ్‌ ‌విశ్వవిద్యాలయంలో యంఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) ‌పట్టా పొందారు. ఏబివిపి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, కరీంనగర్‌ ‌పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎదిగారు.  భారతీయ యువ మోర్చలో క్రియాశీలకంగా పనిచేసి నాయకుల గుర్తింపు పొంది, భాజపా పట్టణ కార్యదర్శి, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీని ముందుకు నడిపించారు. 1996లో యల్‌కె అద్వానీ చేపట్టిన ‘సూరజ్‌ ‌రథ యాత్ర’లో 35 రోజులు పాల్గొని వాహన ఇన్‌ ‌చార్జిగా యాత్ర విజయవంతానికి కృషిలో భాగస్వామి అయ్యారు.

2005లో జరిగిన కరీంనగర్‌ ‌నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో 48వ డివిజన్‌ ‌కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రజల దృష్టిని ఆకర్షించారు. మూడుసార్లు కార్పొరేటర్‌గా భారీ మెజారిటీతో ఎన్నికై తన పట్టణంలో, పార్టీలో పట్టును నిలుపుకున్నారు. కరీంనగర్‌ ‌నడిబొడ్డున లక్ష్మి, సరస్వతి, దుర్గ కొలువైన సుప్రసిద్ధ మహాశక్తి దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించి, మహిళల దీవెనలు పొందారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా కరీంనగర్‌ ‌నుంచి పోటీ పడి 89,508 ఓట్ల ఆధిక్యతతో అనూహ్య విజయం సాధించి, తెరాస సీనియర్‌ ‌నాయకుడు బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌, ‌కాంగ్రేస్‌ ‌వర్కింగ్‌ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ‌ను ఓడించి ‘జెయింట్‌ ‌కిల్లర్‌’‌గా పేరొందారు.

కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో భాజపా అభ్యర్థిగా పోటీ పడి, ప్రజల మనసు గెలిచి, పార్టీకి చారిత్రిక విజయం సాధించారు. భాజపా కేంద్ర నాయకత్వ మద్దతుతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పగ్గాలు చేపట్టారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా సొంత శైలితో, సవాళ్ళు విసురుతూ, హిందుత్వవాదం, పార్టీ సీనియర్‌ ‌నాయకులను కలుపుకొని ముందుకు సాగారు. గతంలో సీనియర్‌ ‌నాయకులు బండారు దత్తాత్రేయ, డా. కె లక్ష్మణ్‌, ‌కేంద్ర మంత్రి జి కిషన్‌ ‌రెడ్డి లాంటి   నాయకుల కంటే చొరవ చూపి రాష్ట్ర పార్టీ అధిపతిగా ఫలితాలను సుసాధ్యం చేసి జాతీయస్థాయి వార్తల్లో గుర్తింపు పొందారు. తమిళనాడు, కేరళ భాజపా ఇంచార్జిగా పనిచేశారు. బీబీనగర్‌-‌హైదరాబాద్‌ ఏఐఐయంయస్‌ ఆసుపత్రి బోర్డు సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు.

కెసిఆర్‌-‌కెటిఆర్‌-‌హరీష్‌ ‌రావు త్రయం గడ్డపై జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి రఘునందవన్‌ ‌రావు గెలుపు కోసం  49 ఏండ్ల ‘ఫైర్‌ ‌బ్రాండ్‌’ ‌సంజయ్‌ ‌నాయకత్వంలో పార్టీ ముమ్మర కృషి చేసి, అద్భుత విజయం సాధించింది. గతంలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌కౌన్సిల్‌లో 4 స్థానాలకు పరిమితమైన పార్టీకి నిన్నటి ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయం సాధించి అధికార పక్షంతో పాటు అన్ని రాజకీయ పార్టీలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. 79 డివిజన్లలో పార్టీని రెండవ స్థానంలో నిలిపి అందరి అంచనాలను తలక్రిందులు చేశారు. బల్దియా ఎన్నికల్లో వినూత్న రీతిలో సాగిన సంజయ్‌ ‌ప్రచార సరళి, హిందుత్వ నినాదం, యంఐయం వ్యతిరేక గళం, సర్జికల్‌ ‌స్టైక్‌ ‌హెచ్చరికలు, తెరాసపై విమర్శనాస్త్రాలు, పెను  సవాళ్ళతో ఓటర్లను బిజెపివైపు  ఆకర్షించగలిగారు.  కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరాని, ప్రకాష్‌ ‌జవదేకర్‌, ‌యూపీ సియం యోగి ఆదిత్యానాథ్‌, ‌పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌, ‌మహారాష్ట్ర మాజీ సియం ఫడ్నవిస్‌, ‌బిజెవైయం అధ్యక్షుడు తేజస్వీ సూర్య వంటి నాయకులను ప్రచారంలో భాగం చేసి, భాజపా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపి, ఓటర్ల మన్ననలు పొందారు.

2016 గ్రేటర్‌ ఎన్నికల్లో 10 శాతం ఓట్లు పొందిన భాజపా 2020 ఎన్నికల్లో 35.56 శాతానికి పెరగడం గమనార్హం. తెరాస ఓట్లు 35.81 శాతంగా (2016లో 44 శాతం) బిజేపి కంటే 0.25 శాతం మాత్రమే అధికంగా నమోదైంది. దుబ్బాక, బల్దియా ఫలితాలు 2023లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఊపుతెచ్చి, గ్రేటర్‌ ‌పరిధిలోని 23 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా నెగ్గుతామని ఆశ వ్యక్తంచేస్తున్నారు.2023 ఎన్నికల్లో భాజపా ఆధిక్యత సాధిస్తే సంజయ్‌ ‌సియం రేసులో ఉండే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply