అంతిమ యాత్రలో పోటెత్తిన జనం
రోడ్డుకు ఇరువైపుల పూలవర్షం కురిపించిన ప్రజలు
కొరోనా వైరస్‌ను లెక్కచేయని అభిమానులు
సైనిక లాంఛ•నాలతో అంత్యక్రియలు
భారత్ చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్‌బాబుకు దేశం మొత్తం కన్నీటి వీడ్కోలు పలికారు. సంతోష్ బాబు పార్థీవ దేహం బుధవారం హకీంపేట విమానాశ్రయం నుండి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివసానికి అర్థరాత్రి 11.40నిమిషాలకు పార్థీవ దేహం చేరుకుంది. పార్థీవ దేహం వెంట రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఉన్నారు. గురువారం తెల్లవారు జామునుండే సంతోష్‌బాబు పార్థీవ దేహన్ని పెద్ద ఎత్తున ప్రజలు సందర్శించా• ••. తన నివాసం నుండి 9.30నిమిషాలకు ఆర్మీ శతకంలో సంతోష్‌బాబు పార్థీవ దేహన్ని తెలంగాణ విగ్రహం నుండి శంకర్ విలాస్, కోర్టు చౌరస్తా మీదుగా సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాదలోని తన వ్యవసాయ క్షేత్రం వరకు భారీ జనసంద్రం మధ్యలో సంతోష్‌బాబు అంతిమయాత్ర సాగింది. తన నివాసం నుండి 6కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపు) పెద్ద ఎత్తున జనాలు భారత్ మాతాకి జై, సంతోష్‌బాబు అమర్రహై, ని త్యాగం వృథాకాదు అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భవనాలపై నుండి సంతోష్‌బాబు పార్థీవ దేహం ఉంచిన వాహనం, ఆర్మీ జవానులపై పూలవర్షం కురిపించారు.రోడ్డుకు ఇరువైపులా త్రివర్ణ పతాకం చేతపట్టుకొని ప్రజలు కన్నీరు మున్నీరు అయ్యారు. అంతిమయాత్రలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపిలు బడుగుల లింగయ్య యాదవ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, తుంగతుర్తి గాదరి కిషోర్‌కుమార్, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్, పలువురు నాయకులు సంతోష్‌బాబు కుటుంబ వ్యవసాయ క్షేత్రం వరకు కాలినడకన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
కరోనా వైరస్ నేపధ్యంలో 50మందికే అంత్యక్రియల ప్రదేశానికి అనుమతి ఇచ్చిన వీటన్నింటిని లెక్కచేయకుండా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మరి ముఖ్యంగా అంతిమయాత్రలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఖబర్థార్, ఖబర్థార్ చైనా అంటూ నినాదాలతో మారుమోగింది. చిన్న, పెద్ద, వృద్దులు అని తేడా లేకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో సంతోష్‌బాబు భార్య, పిల్లలు, తల్లిని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. సుదీర్ఘ సమయం పాటు అంతిమయాత్ర సాగగా, సంతోష్‌బాబు కుమారుడు తండ్రి కోసం ఏడ్చి, ఏడ్చి తల్లి ఓడిలో నిద్రపోయాడు. ఇద్దరు పిల్లలను తన వడిలో కూర్చొబెట్టుకున్న విధానాన్ని చూసి అందరు కంటతడి పెట్టారు. అంత్యక్రియలు సైనిక లాంచనాలతో , రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. తన తండ్రి బిక్కుమళ్ళ ఉపేందర్ సంతోష్‌బాబు చితికి నిప్పు అంటించి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ దృశ్యాలను చూసిన తల్లి మంజుల భార్య సంతోషి, చెల్లెలు కుప్పకూలారు. జనసంద్రాన్ని కట్టడి చేయడం కోసం పోలీసులు అంతిమయాత్ర మార్గంలో రోడ్డుకు ఇరువైపులా భారీ కేడ్లను ఏర్పాటుచేశారు. ఎప్పటికప్పుడు మంత్రి జగదీష్‌రెడ్డి , కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పి ఆర్.భాస్కరన్‌లు పర్యవేక్షించారు. సంతోష్‌బాబు భౌతికకాయాన్ని సందర్శించిన టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజమబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపి వివేక్ వెంటకస్వామి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, జెడ్పిచైర్ పర్సన్ గుజ్జ దీపిక, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వెంకటనారాయణ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సంతోష్‌బాబు కుటుంబానికి అండగా నిలుస్తాం:మంత్రి జగదీష్‌రెడ్డి
భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన భారత మాతా ముద్దు బిడ్డు కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్‌బాబు మరణం దేశానికి తీరని లోటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాద గ్రామంలో సంతోష్‌బాబు అంత్యక్రియల్లో పాల్గొని ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం విలేకరులతో మాట్లాడుతు సూర్యాపేట జిల్లా ముద్దు బిడ్డ సంతోష్‌బాబు ఎంతో సేవ చేయాలనే తపనతో తండ్రికి ఇచ్చిన మాటతో ఆర్మీలో చేరి, ఉన్నతమైన స్థాయిలో ఉండి భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరోచితమైన పోరాటం చేసి వీరమరణం పొందారని కొనియాడారు. భారత్ జాతి మొత్తం కల్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని ఎన్నటికి మరచిపోదని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఒక చౌరస్తాను కల్నల్ సంతోష్‌బాబు విగ్రహన్ని ఏర్పాటుచేసి నామకరణం చేయడం జరుగుతుందని వెల్లడించారు.
సంతోష్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి: టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దేశ రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాద గ్రామంలో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛాలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతు దేశం సంతోష్‌బాబు లాంటి గొప్ప సైనికుడిని కోల్పోయిందని అన్నారు. సంతోష్‌బాబు తండ్రి దేశ కోసం సేవ చేయాలనే ఆయన తపనను తన కొడుకు రూపంలో దేశ సేవకై పంపించడం, వారికి దేశంపై ఉన్న మమకారం ఎమీటో సంతోష్‌బాబు వీరమరణాన్ని చూస్తే అర్థం అవుతుందని తెలిపారు. నేను కూడా దేశ రక్షణలో పాలుపంచుకున్నానని అన్నారు. వారి కుటుంబానికి అందరు అండగా నిలవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం సంతోష్‌బాబు కుటుంబానికి అండగా ఉంటుంది: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సంతోష్‌బాబు పార్థీవ దేహన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సంతోష్ బాబు త్యాగాన్ని మరువలేనిదని కొనియాడారు. వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వారికి అండగా నిలవాలని కోరారు. సంతోష్‌బాబు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఇలాంటి సమయంలో వారి కుటుంబానికి అందరు అండగా నిలవాలని కోరారు.