Take a fresh look at your lifestyle.

అయోధ్యపై…. తీర్పును స్వాగతిస్తున్నాం

ఇది మతతత్వ వాదులకు చెంపపెట్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌


అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్‌ ‌జోషి, సాధ్వి ఉమాభారతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్ధోషులను ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ‌తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ‌సహా పలు రాజకీయ పక్షాలు బీజేపీపై చేసిన ఆరోపణలు ఈ తీర్పుతో తప్పని నిరూపితమయ్యాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సుప్రీం తీర్పు కాంగ్రెస్‌తో పాటు మైనార్టీ వాదాన్ని సమర్థించే మతతత్వ పార్టీలకు చెంపపెట్టు వంటిదని చెప్పారు. ఇప్పటికైనా మత రాజకీయాలు మాని దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

1992 నుంచి బీజేపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ లిబ్రహాన్‌ ‌కమిషన్‌ ‌పేరుతో విచారణను 15 ఏళ్లపాటు సాగదీశారనీ, ఈ ఘటన తరువాత నాలుగు భాజపా పాలిత ర్రాట ప్రభుత్వాలను అక్రమంగా రద్దు చేయడమే కాకుండా ఆరెస్సెస్‌పై నిషేధం విధించారన్నారు. మైనార్టీల బుజ్జగింపు చర్యలలో భాగంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల కమిషన్‌ ‌ద్వారా అనర్హత వేటు వేసేందుకు కూడా కుట్ర చేసిందని ఆరోపించారు. గతంలో ఫైజాబాద్‌ ‌కోర్టు అద్వానీ సహా మిగతా వారందరినీ నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ అలహాబాద్‌ ‌హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించినప్పటికీ బీజేపీపై కక్ష సాధించేందుకు సుప్రీం కోర్టు ద్వారా మరోసారి విచారణ కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ మరోమారు కుట్ర చేసిందని తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన అద్వానీ, జోషి, ఉమాభారతి వంటి పెద్దలు నిర్దోషులుగా బయటికి రావడం హర్షణీయమనీ, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగడం రాబోయే రోజుల్లో దేశంలో రామరాజ్యం విలసిల్లుతుందనడానికి నిదర్శనమని ఈ సందర్బంగా సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply