బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జర్నలిస్టులకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తుచేశారు. అలాంటి జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోవడం లేదన్నారు. వారికి డబుల్ బెడ్ రూమ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, ఇచ్చిన హెల్త్ కార్డులు సరిగా పనిచేయడం లేదని, రానున్న బల్దియా ఎన్నికల్లో బిజెపి పార్టీ కైవసం చేసుకుంటే జర్నలిస్టు మిత్రులకు డబుల్ బెడ్ రూమ్లు, హెల్త్ కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమని అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీ నగర్, రామచంద్రాపురం, పటాన్ చెరు డివిజన్ల అభ్యర్థులు ఆశిష్ గౌడ్, గోదావరి అంజి రెడ్డి, నర్సింగ్ గౌడ్లను కమలం పువ్వు గుర్తుకు వోటు వేసి కార్పొరేటర్లుగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.