సీఎం కేసీఆర్కు తోమాల సేవలు చేస్తామని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ బరి తెగించారని, ఏది చేసినా చెల్లుతుందన్న అహంకారంతో ముందుకు పోతున్నారని అన్నారు. కొండగట్టులో ఆయన స్వామిన సందర్శించుకుననారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని ఆరోపించారు. కేసీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని, కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని దుయ్యబట్టారు. ముగ్గురు కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయొచ్చా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ వర్గం వోట్ల కోసం కేసీఆర్ తాపత్రయ పడుతున్నారని, ముస్లింల వోట్ల కోసమే అసెంబ్లీ పెడుతున్నారని ఆరోపించారు. ముస్లింలకు కొత్తగా రిజర్వేషన్లు ఎందుకు? అని ప్రశ్నించారు. మైనార్టీలను బీసీలు చేస్తారా అని బండి సంజయ్ నిలదీశారు. దుబ్బాకలో బిజెపి విజయం సాధిస్తుందని అన్నారు. దుబ్బాకలో ప్రజలు ఆలోచన చేసి గట్టి బుద్ది చెబుతారని అన్నారు. ఇదిలావుంటే పేదలను దోచుకునేందుకే ఎల్ఆర్ఎస్ బిల్లులను తీసుకుని వచ్చారని బండి మండిపడ్డారు.
ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలని అన్నారు. సామాన్యుడికి పెనుభారంగా మారిన ఎల్ఆర్ఎస్ని ప్రభుత్వం రద్దు చేయాలని, సాధ్యం కాని పక్షంలో ఎటువంటి ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు మేలు జరుగుతుందని, రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పడం కెసిఆర్ అబద్దాలకు పరాకాష్ట అన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలిపారు.