Take a fresh look at your lifestyle.

కేసిఆర్‌ ఒక్కడి వల్లే తెలంగాణ రాలే

  • అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ
  • ఎంఎల్‌సి ఎన్నికల్లో పట్టాభద్రులు బిజెపి వైపే
  • కేసులకు భయపడేది లేదు: బండి సంజయ్‌

సూర్యాపేట, మార్చి 09 ప్రజాతంత్ర ప్రతినిధి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌రాక్షస పాలనను తరిమి కొట్టాలని బిజెపి రాష్ట్ర అధ్దయక్షులు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశం సందర్భంగా ఆయన జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. సంకినేని వెంకటేశ్వర్‌రావు నివాసం నుండి ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక సుమంగళి ఫంక్షన్‌ ‌హాల్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నియంకుశ పాలన కొనసాగుతుందన్నారు. కేసిఆర్‌ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని పదిహేను వందల మంది విద్యార్ధుల త్యాగ ఫలం, సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రవేశ పెట్టిన బిల్లుకు బిజెపి మద్దతు పలికిందన్నారు.

కార్పొరేట్‌ ‌కళాశాలలకు అమ్ముడు పోయి చిన్నపాటి ప్రైవేట్‌ ‌కళాశాల, స్కూల్‌ ‌యాజమాన్యం, సిబ్బంది అప్పుల్లో కురుకుపోయిన, లోన్లు ఇప్పించమని వేడుకున్న పట్టించుకోలేదని ఆరోపించారు. పట్టభద్రుల ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న గుజ్జ ప్రేమేందర్‌రెడ్డి, రామచందర్‌ను ఓడించడానికి కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారన్నారు. కార్పొరేట్‌ ‌స్కూల్‌, ‌కళాశాల యజమానులతో, టిఆర్‌ఎస్‌ ‌నాయకుల స్కూల్‌, ‌కళాశాలలతో కుమ్మకై ఒక్క ఇంట్లో పది దొంగ ఓట్లు వ్రాయించారని పేర్కొన్నారు. వీటిన్నంటిని మేధావులు, పట్టభద్రులు, పుర ప్రముఖులు, ప్రజలు గమనించాలని కోరారు. బిజెపి ఉద్యమాల, త్యాగాల పార్టీ అని అన్నారు. సూర్యాపేట జిల్లా ఉద్యమాల ఖిల్లా అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రం నిధులు లేకుండా రాష్ట్ర సంక్షేమ పథకాలు ఏమిటో కేసిఆర్‌ ‌చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. సూర్యాపేట, నల్లగొండ మెడికల్‌ ‌కళాశాలలు కేంద్రం ఇచ్చిందేనని అన్నారు. పేదలకు ఇచ్చే రూపాయికి కిలో బియ్యం రాష్ట్రానివి ఒక్క రూపాయి అయితే కేంద్రం 29 రూపాయలు ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పిఆర్‌సి ఇవ్వకపోతే బిజెపి ఉద్యమం చేస్తుందని వెల్లడించారు.

ఎంఎల్‌సి స్థానాలను గెలవడం కోసం కేసిఆర్‌ ‌విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అయిన కూడా అది సాధ్యం కాదని బిజెపి అభ్యర్ధులే వైపే పట్టభద్రులు ఉన్నారని పేర్కొన్నారు. బైంసాలో హిందువుల మీద దాడులు జరుగుతుంటే కేసిఆర్‌ ఎం‌దుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎంకు తొత్తుగా ఉండి ఎంఐఎం గుండాలు చేస్తున్న దాడులను ఎందుకు అపడం లేదన్నారు. బిజెపి మతాలకు వ్యతిరేకం కాదని ఎంఐఎం గుండాలకు వ్యతిరేకం అని తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ ‌నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు పేద గిరిజనుల భూములను అధికార పార్టీ నాయకులు లాక్కుంటూ వారిపై తప్పుడు కేసులు పెట్టి చిత్ర హింసలకు గురి చేస్తుంటే విషయం తెలుసుకొని నేను మద్దతుగా వెళ్తే మా జిల్లా అధ్యక్షులు, 25 మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి నెల రోజుల నుండి జైల్‌లో ఉంచారని అన్నారు. 25 మంది కార్యకర్తలను జైల్‌లో పెడితే 25వేల మంది 25వేల మంది బయటకు వచ్చి ఎంఎల్‌సి అభ్యర్ధి గుజ్జ ప్రేమేందర్‌ ‌రెడ్డి విజయం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన భయపడేది లేదని హెచ్చరించారు. కోదాండరాం సార్‌ అం‌టే గౌరవం అని అతను పోటీ చేయకుండా ఉంటే బాగుండేందని అతను గెలిచిన ఉపయోగం లేదని బిజెపి కేంద్రంలో ఉంది కాబట్టి బిజెపి అభ్యర్ధి గెలిస్తే పట్టభద్రుల పక్షన ఉండి ప్రశ్నిస్తారని తెలిపారు. రానున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రేమేందర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి కేసిఆర్‌కు బండి సంజయ్‌ ‌వస్తున్నారంటే భయం వేస్తుందన్నారు. బండి సంజయ్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం వస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాడిన తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ 19మంది ఎంఎల్‌ఏలు గెలువగా అందరు టిఆర్‌ఎస్‌ ‌పార్టీల్లోకి వలస పోయారని అన్నారు. టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ వేరు కాదని రెండు ఒకటేనని ప్రజలు గమనించారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, జిహెచ్‌ఎం‌సిలో ప్రజలు గమనించి బిజెపి వైపే ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంఎల్‌సి అభ్యర్ధి రాముల్‌ ‌నాయక్‌ను పెట్టించింది కేసిఆర్‌ అని ఓట్లు చిల్చడం కోసమేనని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓటు వేయడానికి పట్టాభద్రులు సిద్దంగా లేరని తెలిపారు. బిజెపి ఎంఎల్‌సి అభ్యర్ధి గుజ్జ ప్రేమేందర్‌రెడ్డి గెలిస్తేనే కేసిఆర్‌ ‌మెడలు వంచవచ్చునని అన్నారు. వేరు వాళ్లు ఎవరు గెలిచిన తిరిగి టిఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి చేరుతారని పేర్కొన్నారు. జిల్లాలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని గిరిజనుల భూమి ఇప్పించడానికి వెళ్తే బిజెపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైల్‌లో పెట్టారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని హెచ్చరించారు. బిజెపి ఎంఎల్‌సి అభ్యర్ధిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి అభ్యర్ధి గుజ్జ ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ ‌వెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కడియం రామచంద్రయ్య, సలిగంటి వీరెంద్ర, రాపర్తి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌తుక్కని మన్మథరెడ్డి, కట్కూరి కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రైవేట్‌ ‌కళాశాల, స్కూల్‌ ‌యజమాన్యం బండి సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు.

Leave a Reply