Take a fresh look at your lifestyle.

ప్రస్ట్రేషన్‌లో కేసీఆర్‌ ఏం ‌మాట్లాడుతున్నడో అర్థమైతలేదు

  • బీజేపీని నశం చేసుడు కాదు..మేం తల్చుకుంటే మాడిపోతావ్‌
  • ‌కేసీఆర్‌ ‌పాలన ఇలాగే కొనసాగితే…వంగి దండాలు పెట్టాలేమో
  • కేసీఆర్‌ అవినీతిపై విచారణ ప్రారంభమైంది… అందుకే ప్రధానిపై విమర్శలు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో సీఎం కేసీఆర్‌కు ఫస్ట్రేషన్‌ ఎక్కువై ఏం మాట్లాడుతున్నడో అర్థం కావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగాన్ని తిరగరాస్తానన్నందుకు బుద్ధి వచ్చి ప్రజలకు క్షమాపణ చెబుతాడేమోనని భావించామనీ, కానీ, అందుకు భిన్నంగా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పేందుకు జనగామ సభ పెట్టినట్టుందని పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోనే నంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో ఉన్న పార్టీ అనీ, టీఆర్‌ఎస్‌ ‌లాగా ఉఫ్‌ అని ఊదితే పోయేది కాదన్నారు. బాధ్యత లేని సీఎం బీజేపీని నశం చేస్తానని మాట్లాడుతున్నాడనీ, కానీ మేం తల్చుకుంటే జండుబామ్‌ ‌పెడతామని అన్నారు. లాఠీలకు భయపడకుండా, దాడులకు వెనక్కి తగ్గకుండా బయటకొచ్చిన బీజేపీ కార్యకర్తలను చూసి కేసీఆర్‌ ‌గజగజ వణుకుతున్నడనీ, తెలంగాణలో కేసీఆర్‌ ‌పాలన ఇలాగే కొనసాగితే నిజాం పాలన మాదిరిగా చెప్పులు చేతుల్లో పట్టుకుని వంగివంగి దండాలు పెట్టాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించారు.

సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి కానీ, బీజేపీని టార్గెట్‌ ‌చేయడానికే పెట్టినట్లుందని పేర్కొన్నారు. సీఎం జనగామ సభలో సోడాలో మందు పోసినట్లు మాట్లాడిండనీ, ఆయన ముఖంలో భయం స్పష్టం కనిపిస్తున్నదని పేర్కొన్నారు.సీఎం అవినీతి సామ్రాజ్యం కూలిపోయే రోజు దగ్గరలోనే ఉందనీ, విచారణ ప్రారంభమైందన్న విషయం తెలిసిపోవడంతోనే తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రగిలించే ప్రయత్నం చేస్తున్నరని విమర్శించారు. కేసీఆర్‌ ‌జైలుకు పోకుండా అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే బీజేపీపై విమర్శలు చేస్తున్నారనీ, ప్రధాని మోదీ మాటల్లో తప్పు లేదు కాబట్టే జనగామ సభలో ఆయనపై మాట్లాడలేక పోయారని పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు కేంద్రం మీటర్లు బిగిస్తామని ఎక్కడైనా చెప్పిందా ? దమ్ముంటే చూపించాలని సవాల్‌ ‌విసిరారు. డిస్కంలకు కేంద్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లు అప్పుగా ఇచ్చారనీ, అవి కట్టకపోతే భవిష్యత్తులో తెలంగాణ చీకటిమయం అవుతుందని హెచ్చరించారు.నీ దరిద్రపు పాలనలో తెలంగాణను అప్పుల పాల్జేసినవ్‌, ‌జీతాలివ్వలేకనే కదా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఈ సందర్బంగా బండి సంజయ్‌ ‌విమర్శించారు.

Leave a Reply