Take a fresh look at your lifestyle.

సీఎం కెసీఆర్‌ ‌వి పచ్చి అబద్ధాలు ..!

బిజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
‌హాలియాలో సీఎం చేసిన ప్రసంగంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. తాను చెప్పింది చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగను అని నాగార్జున సాగర్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ ‌మరోసారి పచ్చి అబ్ధద్ధాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌విమర్శించారు.  ఇప్పటిదాకా ఈ మాటను ఆయన ఎన్నో సార్లు తప్పారని ఆయన గుర్తు చేశారు. నాగార్జునసాగర్‌ ‌భూనిర్వాసితులైన గిరిజనుల భూముల్ని టీఆర్‌ఎస్‌ ‌నేతల కబ్జాలపై సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడలేదని సంజయ్‌ ‌ప్రశ్నించారు.

గుర్రంబోడు తండాలో గిరిజన రైతుల భూముల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బినామి అక్రమించుకుంటే అడగడానికిపోతే ప్రైవేటు గుండాలతో దాడిచేయించడమే కాకుండా 40 మందిని రెండు నెలల పాటు జైలులో ఎందుకు పెట్టారో సీఎం కేసీఆర్‌ ‌సమాధానం చెబితే బాగుండేదని సంజయ్‌ అన్నారు. గిరుజనుల భూముల్లో ప్రైవేటు వ్యక్తి వేసుకున్న షెడ్డు తొలగించడానికి గిరిజన యువకులు, వాళ్లకు మద్దతుగాపోయిన బీజేపీ నాయకులపై లాఠీ ఛార్జీ చేసి కేసుల పెట్టిన విషయాన్ని రైతులు అంత సులువుగా మరచిపోతారా అని సంజయ్‌ అన్నారు. నాగార్జున సాగర్‌ ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను తాను కుర్చివేసుకుని కూర్చొని పూర్తిచేయిస్తానని 6 ఏళ్లకిందటే కేసీఆర్‌ ‌చెప్పిన విషయాన్ని సంజయ్‌ ‌గుర్తుచేశారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్‌ ‌కుర్చీ దొరకలేదా అని ప్రశ్నించారు. చేసిన పనికి నిధులు రిలీజ్‌ ‌చేస్తే కేవలం ఏడాదిలో పూర్తిచేస్తానని టన్నెల్‌ ‌వర్క్ ‌చేస్తున్న కంపెనీయే చెబుతుంటే… నిధులు ఇవ్వక దాన్ని పూర్తికాకుండా అడ్డుపడుతున్నది స్వయంగా కేసీఆరే అని బండి అన్నారు.

త్వరలో డిండి పూర్తవుతుందని చెబుతున్న కేసీఆర్‌, ‌దానికి ఎగువన ఉన్న నక్కలగండి ఎప్పుడు పూర్తవుతుంది, శివన్నగూడెం ఎప్పుడు పూర్తవుతుందో ముందుచెప్పాలని సంజయ్‌ అడిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే నాగార్జున సాగర్‌ ‌నియోజకవర్గంలో ఈ ఆరేళ్లలో అదనంగా ఒక్క ఎకరానికి నీళ్లివ్వని ఈ సర్కార్‌… ఉప ఎన్నికలు రాగానే తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరని గుర్తుచేశారు. ఫ్లోరైడ్‌ ‌బాధిత గ్రామాల్లో 2004 నుంచే మంచినీళ్లువస్తున్నాయని, టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌వచ్చి కొత్తగా చేసిందేమి లేదని సంజయ్‌ ‌చెప్పారు. నాగార్జున సాగర్‌ ‌లోని విజయపురిలోనే ఇప్పటికి ఇంటింటికి రోజూ నీళ్లు సరఫరా కాకపోవడం కంటే ఇంకైమైనా దౌర్భాగ్యం ఉంటుందా అన్నారు. నాగార్జున సాగర్‌ ‌ప్రాంతంలో ఉన్న 3 లక్షలకు పైగా ఉన్న బత్తాయి రైతుల ప్రస్తావన కూడా చేయలేదన్నారు సంజయ్‌. ‌పక్కనే ఉన్న పెదఊరలో మూత పడ్డ పళ్లతోటల పరిశోధన కేంద్రం గురించి కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ‌కు కనీస అవగాహన కూడా లేదని ఆయన అన్నారు.

- Advertisement -

ఇంటింటికి మిషన భగీరథ ద్వారా మంచినీళ్లివ్వకపోతే 2018 ఎన్నికల్లో ఓట్లే అడగనన్న వ్యక్తి రాష్ట్రంలో సగం గ్రామాలకు కూడా నీళ్లు రాకున్నా ఏ మొహం పెట్టుకుని ఓట్లడిగారాని ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఇప్పటికీ రాష్ట్రంలో చాలా గ్రామాలకు నీళ్లు రావట్లేదని గుర్తుచేశారు బండి సంజయ్‌. ఎన్నికలు, ఓట్లకోసం కేసీఆర్‌ ఎన్ని అనైతిక పనులైనా చేస్తారని సంజయ్‌ అన్నారు. 3 ఏండ్ల కిందట నాగార్జున సాగర్‌ ‌లో 250 మంది గొల్ల కురుమలు, యాదవులు తలా రూ.31 వేలు కడితే ఉప ఎన్నికలున్నాయని ఇప్పుడు గొర్రెలిచ్చారని బండి చెప్పారు. ఈ మూడేండ్లు యాదవ సోదరులు అప్పుతెచ్చుకున్న ఆ డబ్బులకు వడ్డీకూడా కేసీఆరే ఇస్తే బాగుంటుందన్నారు. ఆ జిల్లా మంత్రి ఆదేశాల మేరకు కృష్ణా నదిపై  అటు – ఇటూ రీ సైకిల్‌ అన్న గొర్రెల లెక్కలు కూడా తీయాలన్నారు సంజయ్‌. ‌పోడు భూముల సమస్యలు, ఎస్టీ రిజర్వేషన్‌ ‌ను ప్రశ్నిస్తే కుక్కలని సంబోధిస్తావా అని బీజేపీ అధ్యక్షుడు అడిగారు.

గిరిజనులపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్న సీఎం దమ్ముంటే ముందుగా వాళ్లకు 10 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నామని ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో కొత్తవాళ్లకు ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్‌ ‌కార్డులు రావాలంటే ఆ నియోజక వర్గంలో బైఎలక్షన్‌ ‌రావాల్సిన దుస్థితి వచ్చిందని సంజయ్‌ అన్నారు. ఇటీవల దుబ్బాకలో ఉప ఎన్నికలు వస్తేనే అక్కడ కొత్తవాళ్లకు పెన్షన్‌, ‌రేషన్‌ ‌కార్డులు ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు నాగార్జున సాగర్‌ ‌లో ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్రాన్ని పాలించే సీఎం ఇంత నీచానికి దిగజారడం దురదృష్టకరమని సంజయ్‌ ‌చేప్పారు. సీఎం చెప్పిన కల్లిబొల్లిమాటలను నాగార్జున సాగర్‌ ‌ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని, దుబ్బాకలో ఇచ్చిన తీర్పునే ఇక్కడ కూడా ఇస్తారని బండి సంజయ్‌ ‌జోష్యం చెప్పారు.

Leave a Reply