Take a fresh look at your lifestyle.

నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే..

  • వరి కొనుగోళ్లపై అసత్యాలు చెబుతారా
  • దమ్ముంటే ఆధారాలు చూపించాలి
  • సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కౌంటర్‌
  • ఎప్పటికైనా జైలు తప్పదన్న ఎంపి ధర్మపురి అర్వింద్‌

కేసీఆర్‌ ‌నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే ఆడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. వరి కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసినా కెసిఆర్‌ ‌కావాలనే అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేసిన విమర్శలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ ‌చేస్తూ ఆదివారం కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్‌ ‌తప్పు బట్టారు. బండి సంజయ్‌ ‌సోమవారం వి•డియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. అసలు గంటకో మాట మాట్లాడేది ఎవరని ప్రశ్నించారు. గంటకో మాట మాట్లాడి రైతులను ఆగం చేస్తున్నది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. ధాన్యాన్ని కేంద్రం కొంటుందా.. రాష్టం కొంటుందా. ఇన్నాళ్లు కేంద్రమే వడ్లు కొన్నది. 40 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చింది. కేంద్రం పంపిన లేఖ కేసీఆర్‌కు వొచ్చిందా.. రాలేదా?, రైతుల చట్టాల విషయంలో కేసీఆర్‌ ‌పూటకో మాట మాట్లాడతారు. మార్కెట్‌ ‌కమిటీలను రద్దు చేస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పింది. దమ్ముంటే కేసీఆర్‌ ఆధారాలు చూపించాలి. 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగవుతుందో కేసీఆర్‌ ‌చెప్పాలి. ఒకసారి వరి వద్దంటారు..మరొకసారి పత్తి వద్దంటారు. రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ ‌మూడేళ్ల క్రితం చెప్పారు.

రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో కేసీఆరే చెప్పాలి. ఉద్యోగాలు ఇవ్వనందునే నిరుద్యోగులు కూలీలుగా మారుతున్నారు. రైతు ఆత్మహత్యలు కేసీఆర్‌కు కనిపించడం లేదా..ప్రతీ గింజా మేమే కొంటామని కేసీఆర్‌ ‌హావి• ఇచ్చారు. కేంద్రం పెత్తనం ఏందని అప్పట్లో కేసీఆర్‌ ‌విమర్శించారు. కేంద్రమంత్రిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నోరు పారేసుకున్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల తగ్గింపు ప్రకటన చేస్తారనే ఆశించాం. కానీ అది జరగలేదు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌రేట్లు ఎందుకు తగ్గించరో చెప్పాలి. లీటర్‌ ‌పెట్రోల్‌పై రాష్ట్రానికి రూ. 28 వొస్త్తుంది. పెట్రోల్‌, ‌డీజిల్‌పై వ్యాట్‌ ‌పెంచలేదని కేసీఆర్‌ ‌చెబుతున్నారు. 2015లో తెలంగాణ రాష్ట్రం వ్యాట్‌ ‌పెంచింది.. జీవోలు ఉన్నాయి’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ ఏదో ఒక రోజు కచ్చితంగా జైలుకు పోకతప్పదని బిజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఆయన చేసిన అవినీతే ఆయనను జైలుకు పంపిస్తుందన్నారు. కేసీఆర్‌ ‌చేసిన అవినీతిపై ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామని చెప్పారు. కేసీఆర్‌కు మతిమరుపు ఎక్కువైందన్నారు. ఆయనిక సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్‌ ‌హౌస్‌లో రెస్ట్ ‌తీసుకోవడం బెటర్‌ అని చెప్పారు. వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. రైస్‌ ‌మిల్లులను ఆధునికీకరించుకోవాలని మాత్రమే రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం తెలిపిందన్నారు. హుజురాబాద్‌లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటమిపాలు కావడాన్ని కేసీఆర్‌ ‌తట్టుకోలేకపోతున్నారని అన్నారు. బీజేపీ సాధించిన ఘన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్‌ ‌నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు.

Leave a Reply