Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

రాష్ట్రంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ప్రతీ బీజేపీ కార్యకర్త పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ,ఉద్యమకారులను ,మేధావులను కలుపుకపోయే విధంగా సమాయత్తం కావాలని పేర్కొన్నారు. మంగళవారం నగర శివార్లలోని ఘట్‌కేసర్‌లో నిర్వహించిన బీజేపీ సైద్ధాంతిక శిక్షణా తరగతుల్లో• శిక్షకుల సమావేశం బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన శిక్షకులనుద్దేశించి మాట్లాడుతూ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కేసిఆర్‌ ‌ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్తను సన్నద్ధం  చేయాలన్నారు. .భారతీయ జనతా పార్టీలో ప్రతీ కార్యకర్త సైద్ధాంతిక నిబద్దత కలిగి ఉండేలా నిర్మాణం చెయ్యాలని ,అందుకు ఈ శిక్షణా తరగతులే వేదిక అవ్వాలని సూచించారు.ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలపెట్టెలా ప్రతీ కార్యకర్త సైనికుడిలా తయ్యారవ్వాలని, కేసిఆర్‌ ‌గల్లీలో తొడలు కొట్టడం డిల్లీలో సలాం లు కొట్టడం తప్ప ఆయన చేసేదేం లేదని విమర్శించారు. బీజేపీ గెలుపు వాతావరణాన్ని దెబ్బ తియ్యాలని ఒక్కరోజు రైతుల పై ముసలి కన్నీరు కార్చి భారత్‌ ‌బంద్‌ ‌లో పాల్గొన్న కేసిఆర్‌ ‌ఢిల్లీకి వెళ్లి కూడా అక్కడ రైతుల ధర్నాకు ఎందుకు మద్దతు పలకలేదు ,కనీసం కలవలేదని ప్రశ్నించారు. •సిఆర్‌ ‌చేతిలో మోసపోయిన ప్రతీ వర్గాన్ని  కలుపుకపొయేవిధంగా బీజేపీ కార్యకర్తలు సమాయత్తం కావాలనీ, రానున్న రోజులన్నీ బీజేపీ వే అని ప్రత్యామ్నాయ శక్తిగా మాత్రమే కాకుండా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇక రెండే పక్షాలు ఒకటి బీజేపీ అనుకూల పక్షం ,బీజేపీ వ్యతిరేఖ కూటమి గా పరిస్థితి తయారైందనీ, కాంగ్రెస్‌,  ‌కమ్యునిస్ట్ ‌లు ఒక్క గూటి పక్షులేనని బీజేపీ వ్యతిరేఖులంతా ఒక్క గూటి పక్షులే అనడానికి మొన్నటి రైతుల భారత్‌ ‌బంద్‌ ‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రంగు జెండాల కలయికే సాక్ష్యమని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు.

Leave a Reply