Take a fresh look at your lifestyle.

పంటల కొనుగోళ్లపై స్పష్టత లేదు

  • కెసిఆర్‌ ఎప్పు‌డేం మాట్లాడుతారో తెలియదు
  • ధాన్యం కొనుగోళ్లకు కేంద్రమే నిధులు ఇస్తుంది
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
  • ‌రైతులపై కోడిగుడ్లు, రాళ్ళతో దాడి చేయించడంపై ఆగ్రహం
  • హుజూరాబాద్‌ ఓటమి తరువాత టిఆర్‌ఎస్‌ ‌దాడులు..నల్లగొండలో బండిపై దాడి దారుణం : ఎంఎల్‌ఏ ఈటల

పంటల సాగుపై సిఎం కెసిఆర్‌ ఎప్పు‌డు ఏం మాట్లాడుతారో తెలియదని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మరోసారి విరుచుకుపడ్డారు. ఓసారి మక్కలు వేయమంటారు..మరోమారు పత్తి వేయమంటారు…మరోమారు సన్నాలు వేయమంటారంటూ మండిపడ్డారు. పంటల విషయంలో ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఏం ‌మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. రోడ్లు, కళ్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యమే ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌లో ఉంటే రైతుల సమస్యలు తెలుస్తాయా అంటూ బండి ప్రశ్నించారు.

రైతుల వి•ద దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్డు, రాళ్లు వేస్తే రైతులకు తగిలాయని…పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతీపైసా కేంద్రం ఇస్తుందని…కోటి లక్షల టన్నుల ధాన్యం కేంద్రం కొన్నదని తెలిపారు. దసరా పండగ కంటే ముందు రైతులు ధాన్యం తీసుకొచ్చారని..కొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తిందన్నారు. పత్తి, మక్కలు, కందులు కేంద్రమే కొంటుందని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తుంటే కేసీఆర్‌ ఏం ‌చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్లదాడికైనా సిద్ధమే అని…ఎన్నైనా భరించడానికి సిద్ధమని బండి సంజయ్‌ ‌స్పష్టం చేశారు.

హుజూరాబాద్‌ ఓటమి తరువాత టిఆర్‌ఎస్‌ ‌దాడులు..నల్లగొండలో బండిపై దాడి దారుణం : ఎంఎల్‌ఏ ఈటల
హుజురాబాద్‌లో ఓటమి తర్వాత ప్రజలపై టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కక్ష కట్టిందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..ఇళ్ల నిర్మాణానికి ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్‌ ‌డ్రామా ఆడుతున్నారన్నారు. ఇక్కడి రైతుల వోట్లతో గెలిచిన కేసీఆర్‌…‌రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. వ్యవసాయం విషయంలో శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పిన మాటలు కేసీఆర్‌ ‌పట్టించుకోరన్నారు. సమస్య వొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడం కేసీఆర్‌కు అలవాటని వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్‌ ఎత్తేసిన ముఖ్యమంత్రి ఎలా ధర్నాలు చేయించారని నిలదీశారు. డబుల్‌ ‌షూటర్‌ ‌హరీష్‌ ‌రావుకు డబ్బులు, మద్యం ఎలా పంచాలో బాగా తెలుసని ఈటల రాజేందర్‌ ‌విరుచుకుపట్టారు. నల్లగొండలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది కావాలని చేసిన దాడిగా అభివర్ణించారు.

Leave a Reply