Take a fresh look at your lifestyle.

సమస్యలు తీర్చమంటే చితకబాదుతారా?

‌విద్యారంగ సమస్యలు తీర్చాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌, ‌పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజాం పాలన సాగుతోందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించమంటే ఇష్టం వచ్చినట్లు చితకబాదుతారా అని మండిపడ్డారు. విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పేంటని నిలదీశారు. విద్యార్థులను సంఘ విద్రోహశక్తులనుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. ఉద్యమకారులమని చెప్పుకుంటూ విద్యార్థి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులు తిరగబడితే ఏం జరుగుతుందో గత పాలకులు చూశారనీ, త్వరకలోనే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలు తీర్చే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. విద్యార్థులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

Leave a Reply