Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌కుటుంబంలో తెలంగాణ బందీ

బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ ‌కుటుంబం చేతిలో బందీ అయిందని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. ఈ నెల 17న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో తరుణ్‌ ‌చుగ్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ‌కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి కల్పించేందుకే అమిత్‌ ‌షా నిర్మల్‌కు వొస్తున్నారని తెలిపారు.

చారిత్రాత్మక ప్రాశస్త్యం గల నిర్మల్‌ ‌గడ్డ కొత్త చరిత్రకు నాంది పలకబోతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో కేసీఆర్‌ ‌గుండెల్లో దడ మొదలయ్యిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతృత్వంలో రామరాజ్యం స్థాపనకు అమిత్‌ ‌షా శంఖారావం పూరించబోతున్నారని తరుణ్‌ ‌చుగ్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply