Take a fresh look at your lifestyle.

బీజేపీ అధ్యక్ష పదవిరేసులో లేను: బీజేపీ సీనియర్‌ ‌నేత విద్యాసాగర్‌రావు

Former Governor Vidyasagar

  • అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా శిరసావహిస్తా: బీజేపీ సీనియర్‌ ‌నేత విద్యాసాగర్‌రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌, ఆ ‌పార్టీ సీనియర్‌ ‌నేత సిహెచ్‌ ‌విద్యాసాగరరావు స్పష్టం చేశారు. తన కన్నా జూనియర్‌లు రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని, వారితో కలిసి పనిచేశానని ఆయన పేర్కొన్నారు. దతాత్రేయ, కిషన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో పదవులకోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదని, అన్నారు.గురువారం మాతృభాషా దినోత్సవంలో పాల్గొన్న విద్యాసాగర్‌రాను విలేకరులు ప్రశ్నలడిగిన సందర్బంలో ఆయన  స్పందించారు. పార్టీలో ఏ పనిచెప్పినా చేయడం అలవాటుగా చేసుకున్నానని, క్రమశిక్షణగల బీజేపీ కార్యకర్తగా ఉంటానని తన వైఖరిని పునరుద్ఘాటించారు.

కేంద్ర నాయకత్వం తెలంగాణ బీజేపీని సుసంపన్నం చేసేందుకు దృష్టి సారించిందని, కేంద్ర నాయకత్వమే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాగా గురువారం బెంగుళూర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన సభలో ముస్లిం  పాకిస్తాన్‌ను సమర్థిస్తూ చేసిన నినాదాలపైన ఆయన కామెంట్‌ ‌చేశారు. ఆమె మాట్లాడిన వేదికమీద  ఎంఐఎం నేత అసదొద్దీన్‌ ఓవైసీ ఉన్నందుననే ఆమెకు అంత ధైర్యం వచ్చిందని అన్నారు. సీఏఏపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసినా అది  చెల్లదని వ్యాఖ్యానించారు. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఆర్టికల్‌ 370, ‌ట్రిపుల్‌తలాక్‌పైన నిరసనలు ఎందుకు చేయలేదనీ, సీఏఏపై మాత్రమే ఎందుకు అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని రాజకీయ పార్టీలను చెన్నమనేని ప్రశ్నించారు.

Leave a Reply