Take a fresh look at your lifestyle.

భూకబ్జాల వెనుక ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ ‌బడా నేతలు కెటిఆర్‌ అం‌డదండలతోనే దందాలు

బిజెపి నేత ప్రభాకర్‌ ‌సంచలన ఆరోపణలు
బీజేపీ సీనియర్‌ ‌నేత ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగే భూదందాల్లో సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ హస్తముందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ ‌ప్రమేయంతోనే భూదందాలు జరుగుతున్నాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నకిలీ పత్రాలతో కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హఫీజ్‌పేట్‌ ‌భూములు ఎవరివో ప్రభుత్వం తేల్చాలని పట్టుబట్టారు.

- Advertisement -

ఆక్రమణదారులను కాపాడేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌, ‌ధరణీ తీసుకొచ్చారని దుయ్యబట్టారు. మియాపూర్‌, ‌హఫీజ్‌పేట్‌ ‌భూకబ్జాల వెనుక ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ ‌బడా నేతలున్నారన్నారు. ప్రవీణ్‌రావు, అఖిలప్రియతో పాటు టీఆర్‌ఎస్‌ ‌నేతల ప్రమేయాన్ని తేల్చాలని డిమాండ్‌ ‌చేశారు. ల్యాండ్‌, ఇసుక, డ్రగ్‌ ‌మాఫియాకు సీఎం పేషీ సెంటర్‌గా మారిందని ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌ ‌మండిపడ్డారు.

Leave a Reply