Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో బిజెపి నిరసన

వనపర్తి,మే,16(ప్రజాతంత్ర విలేకరి) : భారతీయ జన తా పార్టీ రాష్ట్ర అధ్యక్షలు ఎంపి బండి సంజయ్య పిలుపు మేరకు బిజెపి నాయకులు ప్రముఖ న్యాయవాది బూజల వెంకటేశ్వర్‌రెడ్డి నివాసంలో నల్ల జెండా ఎగర వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి పాడు హెడ్‌ ‌రెగ్యులేటరి విషయంలో నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం జివో నెంబర్‌ 203 ‌విడుదల చేసిన ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అసమర్థ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు తమ ఇండ్ల వద్ద నల్ల జెండాలు ఎగరవేసి నిరసనలు తెలిపారు. పోతిరె డ్డిపాడు సామర్థ్యాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌తెరాస సంకీర్ణ ప్రభుత్వం 44 క్యూసెక్కులకు పెంచారు. 44 క్యూసెక్కుల సామార్థ్యానికి సంబంధించిన వివాదం కృష్ణానది బోర్డు పరిధిలో ఉందని ఆ వివాదం పరిష్కా రం కాకముందే మరో జివో ఎలా విడుదల చేశారని పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అందుకు బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రామన్నగా రి వెంకటేశ్వరరెడ్డి మండల మాజీ అధ్యక్షలు పెద్ది రాజు , సవాయిగూడెం కృష్ణయ్య  తదితరులు పాల్గొన్నారు.

వెల్దండలో…
వెల్దండ : పోతిరెడ్డిపాడు కు కృష్ణ వాటర్‌ ‌బోర్డు కేటాయించిన నీటి కంటే అధికంగా తీసుకుపోయి ఎందుకు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం జీవో నెంబర్‌ 203 ‌ను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు శనివారం వెల్దండ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు విజేందర్రెడ్డి ఎంపీటీసీ ఉమా ఇంటి పై నల్ల జెండా ఎగరేసి నిరసన వ్యక్తం చేశారు ఈ జీవో తో వెనుకబడ్డ పాలమూరు జిల్లా ఎడారిగా మారనున్న దని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి జీవోను రద్దు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

పోతిరెడ్డిపాడు జీవో వ్యతిరేకం :
మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌ ‌రెడ్డి

మెదక్‌ : ‌పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల పథకం జీవో తెలంగాణకు వ్యతిరేకమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ ‌రెడ్డి ఇ తీవ్రస్థాయిలో ఆరోపించారు ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు ఎన్నికల హామీలను మంచి పోతిరెడ్డిపాడు పై నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు పోతిరెడ్డిపాడు పై టీఆర్‌ఎస్‌ ‌వైఖరి విరుద్ధంగా ఉందని ఆరోపించారు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి ఇ వ్యవహరిస్తు న్నాడని విమర్శించారు గతంలో మెదక్‌ ‌ప్రాంతంలోని ఘనపురం ప్రాజెక్టు నుండి 16 టీఎంసీల సాగునీరు అక్రమంగా తరలించుకుపోయా రు అని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతానికి మేలు చేయడం గొప్ప కాదని తెలంగాణ వ్యాప్తంగా సాగు నీరు అందిస్తే ప్రజలు సంతోషిస్తారని అది గుర్తుంచు కోవాలని ఆయన అన్నారు తెలంగాణ ప్రాంతంలో సాగునీరు లేక పంటలు ఎండిపోయి బీడు భూములుగా మారుతున్నాయని వాపోయారు ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కమీషన్ల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపుమేరకు పాపన్నపేట మండలం యూసుఫ్‌ ‌పేట గ్రామంలో నల్ల జెండాను ఎగరవేసి నిరసన తెలిపారు.

కాగజ్‌నగర్‌లో…
కాగజ్‌నగర్‌ :  ‌పోతిరెడ్డి పాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌సా మర్థ్యం పెంపు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపి ప్రభుత్వం జీవో జారీ చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అసమర్థ కేసీఆర్‌ ‌సర్కార్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర బిజేపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపు మేరకు బిజేపి నాయకులు, కార్యకర్తలు తమ ఇండ్లల్లో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కాగజ్‌నగర్‌ ‌పట్టణంలో బిజేపి సిర్పూర్‌ ‌నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్‌ ‌కొత్తపల్లి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బిజేపి కార్యాలయంపై నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజేపి పట్టణ అధ్యక్షుడు గోలెం వెంకటేష్‌, ‌మెడి కార్తీక్‌, ‌శరద్‌ ‌శర్మ, అరుణ్‌ ‌డిగ్రీ, సాయి కృష్ణ, మల్లేష్‌, ‌మాచర్ల శ్రీనివాస్‌, ‌రవికాంత్‌, ‌బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply