Take a fresh look at your lifestyle.

బిజెపి విద్యుత్‌ ఆం‌దోళన భగ్నం

  • ముందే నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • సర్కార్‌ ‌నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న లక్ష్మణ్‌

‌విద్యుత్‌ ‌బిల్లులపై ఆందోళన చేయాలనుకున్న బిజెపి నేతలను ఎక్కడిక్కడ అరెస్ట్ ‌చేశారు. ముందస్తుగా నేతలను గృహనిర్బంధం చేశారు. బీజేపీ నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలపై ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ ‌బిల్లుల భారం మోపడంపై బీజేపీ రాష్ట్ర కమిటి నిరసన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ‌లోని విద్యుత్‌ ‌సౌధతో పాటు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట ధర్నా చేయాలని పిలుపునిచ్చింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి గొడవలు జరకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆ పార్టీ నేతలను హౌస్‌ అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్‌ ‌రావు ను హైదరాబాద్‌ ‌తార్నాకలోని తన ఇంట్లో హౌస్‌ అరెస్టు చేశారు పోలీసులు. ముషీరాబాద్‌ అశోక్‌ ‌నగర్‌ ‌లో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌ ఇం‌టి దగ్గర పోలీస్‌లు మోహరించారు. సీఎం కేసీఆర్‌ ‌నిజాం సర్కార్‌ ‌లా వ్యవహరిస్తున్నారని బిజెపి నేత లక్ష్మణ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే? ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోం దన్నారు.

విద్యుత్‌ ‌బిల్లులు ఎక్కువ వేయడం,సకాలంలో చెల్లించని వారు ఇంట్రెస్టుతో బిల్లులు చెల్లించాలని అనటం సరైంది కాదన్నారు. వారంరోజులుగా పోరాటం చేస్తున్నా సర్కార్‌ ‌పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 300 రూపాయల విద్యుత్‌ ‌బిల్లు వచ్చే వారికి 3వేలు బిల్లు వేశారన్నారు. ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజలకు ప్రభుత్వం మేలు చేయాలి కానీ.. ప్రజలపై భారం మోపేలా చేయవద్దని సూచించారు. ఇక పోలీసులను కల్వకుంట్ల సేవకు అన్నట్లు మార్చిన సీఎం కేసీఆర్‌కు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విద్యుత్‌ ‌చార్జీల మాఫీపై జిల్లాలోని ఎంపీడీసీఎల్‌ ‌ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ వివేక్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఆయన్ను వరంగల్‌ ‌సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వివేక్‌ ‌మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అదనపు విద్యుత్‌ ‌చార్జీల పేరుతో రూ.800 కోట్ల భారం మోపుతోందన్నారు. వారం రోజులుగా పోరాటం చేస్తున్నా సర్కార్‌ ‌పట్టించుకోవడం లేదని విర్శించారు. విద్యుత్‌ ‌బిల్లులు మాఫీ చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. రూ.300 వచ్చే వాళ్లకు రూ.3 వేలు బిల్లు వేశారని ఆరోపించారు. ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజలకు ప్రభుత్వం మేలు చేయాలని ఆలోచించాలి కానీ ప్రజలపై భారం మోపేలా కాదని హితవు పలికారు. ఎక్కువ బిల్లులు వేయడం, వడ్డీతో కట్టమనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నిజాం సర్కార్‌లా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ ‌కల్వకుంట్ల స్వవకు అన్నట్లుగా మార్చారన్నారు. సీఎంకు ప్రజలు తగిన గుణపాఠం చెబురని మాజీ ఎంపీ వివేక్‌ ‌హెచ్చరించారు.

Leave a Reply