Take a fresh look at your lifestyle.

కెటిఆర్ కోటలో బిజెపి పాగా

it minister ktr
టీఆర్ఎస్ కు పెట్టని కోట, కెటిఆర్ కంచుకోట సిరిసిల్ల నియోజక వర్గం పరిధిలోని పెద్దూరు సహకార సంఘం చైర్మన్ స్థానాన్ని బిజెపి వ్యూహాత్మకంగా చేజిక్కించుకుంది. మొత్తం 13 వార్డులకు గాను 7 స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్దూరు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి తమకు సరిపడ మద్దతు లేకున్నా చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డది అంగ,అర్ద బలం ఉన్నప్పటికీ బిజెపి ఎత్తులకు టీఆరెఎస్ చిత్తయింది.  మంత్రి కెటిఆర్ కూడా తమ శ్రేణులను రంగంలోకి దింపి శక్తివంచన లేకుండా కృషి చేసినా ఫలితం దక్కలేదు. ఆదివారం జరగాల్సిన ఎన్నికను పతకం ప్రకారం వాయిదా వేయించినా పరిస్థితి అధికార పార్టీ కి అనుకూలించక టీఆర్ఎస్ చేష్టలుడిగి ఢీలా పడ్డది. పెద్దూరు స్థానం చేజారే పరిస్థితులు ఉత్పన్నమైన తీరుపై  మంత్రి తమ నేతలపై నిప్పులు చేరిగినట్లు తెలిసింది. ఎట్టకేలకు పెద్దూరు స్థానాన్ని బిజెపి గెలుచుకొని తమ అభ్యరి వెంకటలక్ష్మి ని చైర్మన్ గా ఎన్నుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లవిరుస్తోంది. చైర్మన్ ఎన్నిక ముగిసే వరకు బిజెపి నేతలు కలిసి కట్టుగా పని చేసి తమ పార్టీనీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గట్టెక్కించారు. దీంతో ఒక వైపు బిజెపి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తుండగా మరోవైపు టీఆర్ఎస్ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది.

Leave a Reply