Take a fresh look at your lifestyle.

మోడీ మాత్రమే ఓబీసీల ఆపద్బంధువు..!

కేంద్ర మంత్రివర్గంలో 27 మంది  బిసిలు
కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఓబీసీలను అణిచి వేస్తున్నది
బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌

బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌ ‌ఢిల్లీలో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తన ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ ఓబిసి మోర్చా మొదటి కార్యవర్గ సమావేశానికి సంబంధించిన వివరాలు తెలిపారు. బీజేపీ ఓబిసి మోర్చా మొదటి కార్యవర్గ సమావేశానికి వొచ్చిన అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఈ మీడియా సమావేశంలో లక్ష్మణ్‌తో పాటుగా హాజరయ్యారు. తన ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ ఓబిసి మోర్చా మొదటి కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రులు కూడా హాజరు అయ్యారని లక్ష్మణ్‌ ‌తెలిపారు. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డా కూడా హాజరు అయ్యారు. ఈ సమావేశంలో గత 70 ఏళ్లుగా దేశంలోని ఓబీసీల స్థితి గతులపై చర్చ జరిగిందని లక్ష్మణ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌ 60 ‌యేళ్లపాలనలో  ఓబీసీ వర్గాలకి చేసింది ఏం లేదని, నెహ్రూ నుంచి రాజీవ్‌ ‌గాంధీ వరకు బీసీలను వోటు బ్యాంకుగా చూసారు. నెహ్రూ నియమించిన కాకా కాలేకర్‌ ‌కమిటీ రిపోర్ట్ ‌పార్లమెంటులో పెట్టకుండా బుట్ట దాఖలు చేసారు. మురార్జీ దేశాయ్‌ ‌సమయంలో మండల్‌ ‌కమిషన్‌ ‌వొచ్చిందని, అయినా అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఆ తరువాత మోడీ అధికారంలోకి వొచ్చాకే ఓబీసీలకు న్యాయం జరిగిందని లక్ష్మణ్‌ అన్నారు. ‘కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు 70 ఏళ్లుగా బిసిలను అణిచివేయగా… మోడీ తన కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బిసిలను మంత్రులుగా నియమించారు. అంతే కాకుండా ఓబిసి జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు. 27 శాతం రిజర్వేషన్లు ఖచ్చింతంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టారు ప్రధాని మోడీ. ఓబిసి కులాల వర్గీకరణకు కమిషన్‌ ‌వేశారు. బీసీలకు ఎవరైనా న్యాయం చేసారంటే అది కేవలం ప్రధాని మోడీనే. ఏడు సంవత్సరాల తన పాలనలో మోడీ ఇలా చేయగలిగితే కాంగ్రెస్‌ ‌యేళ్లపాలనలో ఏం చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని అభినందించే కార్యక్రమాలు దేశవ్యాపితంగా ఏర్పాటు చేస్తాం. ఎన్నికలు జరగనున్న రాష్టాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం అని లక్ష్మణ్‌ ‌తెలిపారు. ఈ విషయాలు ప్రజలకి చెప్పాలి’ అని కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని లక్ష్మణ్‌ ‌తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయలేదు. కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఓబీసీలను అణిచి వేస్తున్నది. ఈ విషయం మీద తెలంగాణాలో పెద్ద ఉద్యమం  చేస్తామని లక్ష్మణ్‌ ‌చెప్పారు. కెసిఆర్‌ ‌పెత్తందారు ప్రభుత్వాన్ని ఎండగడతామని లక్ష్మణ్‌ ‌ప్రకటించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే అంశం గురించి పార్టీ.. ప్రభుత్వంలో చర్చలు జరుపుతామని లక్ష్మణ్‌ ‌వెల్లడించారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తీర్మానం చేయాలని లక్ష్మణ్‌ ‌డిమాండ్‌ ‌చేసారు. కాంగ్రెస్‌ ‌బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. కులాల వారి బీసీ జనాభా లెక్కల సేకరణకు మేము అనుకూలంగా వున్నాం. 33 లక్షల కులాలు ఉన్నాయని యూపీఏ ప్రభుత్వం గతంలో ఈ అంశాన్ని పక్కదారి పట్టించింది. ఆగస్టులో మహారాష్ట్రలో ఓబీసీ ర్యాలీలు పెద్దఎత్తున చేస్తాం. మహారాష్ట్రలో తెలంగాణాలో ఓబీసీలు దారుణపైనా పరిస్థితిలో వున్నారు. దేశవ్యాపితంగా కాంగ్రెస్‌ ఓబీసీలకు చేసిన అన్యాయన్ని చేపి ప్రజలను చైతన్య వంతులను చేస్తామని లక్ష్మణ్‌ అన్నారు.

Leave a Reply