Take a fresh look at your lifestyle.

‌ప్రతిదీ ప్రైవేటీకరించడం సరికాదు

విశాఖ స్టీల్‌ ‌ప్రైవేటీకరణపై సుబ్రమణ్యస్వామి
ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి వ్యతిరేకించారు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ సరికాదని.. తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణనూ వ్యతిరేకించానని.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌విషయంపై నాకు అవగాహన లేదు.. కానీ ప్రతీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తామనే విధానం మంచిది కాదని కేంద్రానికి చురకలు అంటించారు.

విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానిని కలిసేటప్పుడు నేనూ సీఎం జగనుతో వెళ్తానని ఆయన పేర్కొన్నారు. తెర వెనుక చంద్రబాబు ఉండి టీటీడీపై దుష్పచ్రారం చేయిస్తున్నారని.. వెంకన్న భక్తునిగా ఈ దుష్పచ్రారం విషయంలో చాలా బాధ పడ్డానని తెలిపారు. చంద్రబాబు సడెనుగా సోనియా కాళ్లపై ఎందుకు పడ్డారో ఇప్పటికీ సమాధానం చెప్పుకోలేదని… చంద్రబాబును విశ్వసనీయత లేని వ్యక్తి అని మండిపడ్డారు.

ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా లేదా అనే అంశంపై కేస్‌ ‌బై కేస్‌ ‌చూడాల్సి ఉంటుందని.. టీటీడీని అటానమస్‌ ‌బాడీ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. టీటీడీ అకౌంట్లను రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా కాగ్‌ ‌తో ఆడిట్‌ ‌చేయించాలన్న సీఎం నిర్ణయం చాలా మంచి పరిణామమని… టీటీడీని భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలని సూచించారు. పెట్రోల్‌, ‌డిజీల్‌ ‌ధరల పెరుగుదల ప్రజలకు భారంగా మారిందని తెలిపారు.

Leave a Reply