Take a fresh look at your lifestyle.

బీజేపీ ఎంపీ లైంగికంగా వేధిస్తున్నాడు

న్యూ దిల్లీ, జనవరి 19 : రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు వ్యతిరేకంగా భారత కుస్తీ వీరులు రోడ్డెక్కారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ‌తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌, ‌కోచ్‌లపై స్టార్‌ ‌స్టార్‌ ‌రెజ్లర్‌ ‌వినేశ్‌ ‌ఫొగాట్‌ ‌సంచలన ఆరోపణలు చేసింది. మహిళా రెజ్లర్లను వారు లైంగికంగా వేధిస్తున్నారని, ఆయన వల్ల తాను ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది. ‘మహిళా రెజ్లర్లను బ్రిజ్‌ ‌భూషణ్‌, ‌జాతీయ కోచ్‌లు లైంగికంగా వేధించారు. నన్ను ఎందుకూ పనికిరావని ఘోరంగా తిట్టారు. బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌వేధింపుల వల్ల నేను ఎంతో మానసిక క్షోభకు గురయ్యా. ఓసారి సూసైడ్‌ ‌కూడా చేసుకోవాలనుకున్నా. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గతంలో నన్ను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయి’ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది వినేశ్‌.

ఈ ఆం‌దోళనలో వినేష్‌ ‌ఫోగట్‌తో పాటు బజరంగ్‌ ‌పునియా, సాక్షి మాలిక్‌, ‌సంగీతా ఫొగాట్‌, ‌సుమిత్‌ ‌మాలిక్‌, ‌సరితా మోర్‌ ‌సహా 30 మంది స్టార్‌ ‌రెజ్లర్లు పాల్గొన్నారు. బ్రిజ్‌ ‌భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేవరకు తాము ధర్నా కొనసాగిస్తామని, అప్పటిదాకా ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ తాము పాల్గొనబోమని రెజర్లు స్పష్టం చేశారు. కాగా ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్లు పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం శిక్షణా శిబిరాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇంతలోనే రెజ్లర్లందరూ ఆందోళనకు దిగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కాగా రెజ్లర్ల ఆందోళనలపై రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌ ‌స్పందించారు. గత పదేళ్లుగా ఫెడరేషన్‌?‌తో ఎలాంటి ఇబ్బందులు రాని రెజర్లకు.. కొత్త నియమాలు, నిబంధనలు తీసుకొచ్చాక వచ్చాయా అని ప్రశ్నించారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ల వెనుక ఓ బడా పారిశ్రామిక వేత్త ఉన్నారేమోనని తనకు అనుమానం వస్తుందన్నారు.

తాను పదవికి రాజీనామా చేయనని, పోలీసులు విచారణకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రాణహాని వస్తే వినేష్‌? ‌ఫొగాట్‌? ‌పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. కాగా, 2011 నుంచి బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019లో వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ పార్టీలో కొనసాగుతున్న భూషణ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ ‌లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు రెజ్లర్ల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై 72 గంటల్లోగా వివరణ క్రీడా మంత్రిత్వ శాఖ రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ను కోరింది. ఈ విషయం ఆటగాళ్ల సంక్షేమానికి సంబంధించినది కాబట్టి, మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని ఔఖీ×కి పంపిన సందేశంలో మంత్రిత్వ శాఖ తెలిపింది. 72 గంటల్లో సమాఖ్య సమాధానం ఇవ్వకపోతే, జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్‌ 2011 (‌స్పోర్టస్ ‌కోడ్‌) ‌ప్రకారం చర్యలు తీసుకుంటామని క్రీడా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీనితో పాటు, లక్నోలో ప్రారంభమైన మహిళల కోచింగ్‌ ‌క్యాంపును కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లక్నోలోని నేషనల్‌ ‌సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో 41 మంది రెజ్లర్లు, 13 మంది కోచ్‌లతో జనవరి 18 నుంచి ప్రారంభమైన శిబిరాన్ని రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Leave a Reply