Take a fresh look at your lifestyle.

బీజేపీ, ఎంఐఎం, టీఆరెస్‌లది.. తెరముందు కుస్తీ..తెర వెనుక దోస్తీ

  • బస్తీ హమారా.. బల్దియా హమారా నినాదంతో పోరాడుతాం
  • ఎక్కడైనా ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీకి సహకరిస్తుంది
  • టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌,ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి

కేసీఆర్‌, ‌బండి సంజయ్‌ ‌కలిసి తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ఇద్దరు కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మార్చుకున్నారని, ఎంఐఎం, బీజేపీ, టిఆర్‌ఎస్‌ ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఆయన మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి కలిసి గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ….కాంగ్రెస్‌ను బలహీనం చేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారని రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంఐఎం సంపూర్ణ సహకారం అందిస్తోందని, అందుకు టిఆర్‌ఎస్‌ ‌సమన్వయం చేస్తోందని బీహార్‌లో అదే జరిగిందని తెలిపారు. అసద్‌ ‌జైల్‌కు వెళితే బెయిల్‌ ఇప్పించింది బీజేపీ నేత రఘునందన్‌ ‌రావేనని, బీజేపీ, ఎంఐఎంలది తెరముందు కుస్తీ, తెర వెనుక దోస్తీ అంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ ఆత్మ అయిన జూపల్లి రమేశ్వర్‌ ‌రావ్‌ ‌మైనింగ్‌ అ‌క్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఎంపీ అరవింద్‌ ‌ఫిర్యాదులు చేశారని, ఎంపీ అరవింద్‌ ‌రామేశ్వర్‌ ‌రావుపై ఫిర్యాదు చేస్తే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి రామేశ్వర్‌ ‌రావ్‌, ఆయన కొడుకుతో కలిసి పార్లమెంట్‌లో కేంద్ర మైనింగ్‌ ‌శాఖ మంత్రిని కలిసి రామేశ్వర్‌ ‌రావుపైన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని విరుచుకుపడ్డారు.

బీజేపీకి నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్తున్న సిద్ధాంతాలు వాళ్ళు నమ్మితే రఘునందన్‌ ‌రావ్‌, ‌కిషన్‌ ‌రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఇదే సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, అసదుద్దీన్‌ ‌సఖ్యతగా ఉన్న వీడియోను రేవంత్‌ ‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. కిషన్‌ ‌రెడ్డిని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని అన్నారు. మోదీ విధానాలను తాము తప్పని చెబితే కేసీఆర్‌ ‌వారికి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ నేతలు సచివాలయంలో వందేళ్ల చరిత్ర ఉన్న నల్లపోచమ్మ గుడిని కూల్చితే ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. ఈఎస్‌ఐ, ‌సహారా కుంభకోణాల్లో సీబీఐ కేసులలో ఉన్న కేసీఆర్‌ను కాపాడుతుంది బీజేపీనే అని, బండి సంజయ్‌ ‌సంతకాన్ని ఫోర్జరీ చేసారని బండి సంజయ్‌ అం‌టున్నారని, ఇక్కడే కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి ఉన్న బీజేపీ నేరుగా చర్యలు తీసుకోకుండా ఎందుకు నాన్చుతుందని నిలదీశారు. బండి సంజయ్‌కి భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఉన్న నమ్మకం కిషన్‌ ‌రెడ్డి మీద లేదా అని అన్నారు. సంతకం ఫోర్జరీ చేస్తే కేంద్రమంత్రిగా కిషన్‌ ‌రెడ్డి విచారణకు అదేశించవొచ్చని, అలాగే ఎంఐఎంకు, టిఆర్‌ఎస్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటున్న బీజేపీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై పోరాటం చేస్తున్నాయని, టిఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీల్లో చేరిన చాలా మంది బడా నాయకులు కనీసం ప్రెస్‌ ‌మీట్లు పెట్టే పరిస్థితి కూడా లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. బస్తీ హమారా.. బల్దియా హమారా అనే నినాదంతో తాము ఎన్నికలలో పోరాడుతామని అన్నారు.

Leave a Reply