Take a fresh look at your lifestyle.

కొరోనా తీవ్రత, సచివాలయ కూల్చివేతపై బిజెపి సీరియస్‌

‌పార్టీ ప్రముఖులతో కిషన్‌రెడ్డి సమావేశం

తెలంగాణలో కొరోనా తీవ్రత, సచివాలయం కూల్చివేత వ్యవహారంపై  బిజెపి సీరియస్‌గా చర్చిస్తోంది. ఈ రెండు వ్యవహారాలపై గత కొన్నిరోజులుగా ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై శనివారం నాడు బీజేపీ ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ •టల్‌లో సమావేశం అయ్యారు.

ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ ‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌లక్ష్మణ్‌, ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ ‌తదితరులు హాజరయ్యారు. భేటీలో భాగంగా తాజా రాజకీయ పరిణామాలు, సచివాలయం, నల్లపోచమ్మ దేవాలయం కూల్చివేత, కరోనా తీవ్రత, కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయం,  భవిష్యత్‌ ‌కార్యాచరణపై నిశితంగా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం డియా ట్‌ ‌నిర్వహించి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. కాగా.. శుక్రవారం నాడు మురళీధర్‌ ‌రావు ఈ కూల్చివేతల వ్యవహారంపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం విదితమే. ప్రభుత్వం కూడా కూలిపోతుందని హెచ్చరించారు.

Leave a Reply

error: Content is protected !!