Take a fresh look at your lifestyle.

33‌వ రోజుకు చేరిన బిజెపి భోజనం వితరణ

నాగర్‌ ‌కర్నూల్‌,ఏ‌ప్రిల్‌30 ‌ప్రజాతంత్రవిలేకరి: కరోనా వైరస్‌ ‌నియంత్రణ కోసం లాక్‌ ‌డౌన్‌ ‌కర్ఫ్యూ విధించిన కారణంగా నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కేంద్రం లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భోజనం పంపిణీ కార్యక్రమం గురువారం నాటికి 33వ రోజుకు చేరుకున్నది.ఈసందర్భంగా బిజెపి పార్లమెంట్‌ ‌కన్వీనర్‌ ‌బుసిరెడ్డి సుధాకర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌తో నెలకొన్న విపత్కర సమయంలో బడుగు బలహీన ప్రజలు,వలస కార్మికులు, నిరాశ్రయులైన వారెవరూ ఇబ్బందులు పడకూడదని ప్రధాని నరేంద్రమోది, బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్‌ ‌లు పిలుపు నిచ్చారని అన్నారు.పిలుపునివ్వడమే గాక కార్యకర్తలకు ఇచ్చిన కార్యాచరణ మేరకు అసెంబ్లి ఇంచార్జి నెడునూరి దిలీపాచారి ఆధ్వర్యంలో నాగర్‌ ‌కర్నూల్‌ ‌బిజెపి కార్యాలయంలో అహారం వండి పంపిణీ చేసే బృహత్‌ ‌కార్యాన్ని ప్రారంభించి నేటికి 33 రోజులైంది.

నిరంతరంగా పేదలకు వలస కార్మికు లకు భోజనవసతి పంపిణీ నిర్వహిస్తున్నామని పార్లమెంటు కన్వీనర్‌ ‌బుసిరెడ్డి సుధాకర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. 33 రోజులుగా నిరంతరంగా సాగుతున్న భోజన వసతి, పంపిణీని ఒక పవిత్ర యజ్ఞంగా, నిష్టతో లాక్‌ ‌డౌన్‌ ‌పూర్తైయ్యేవరకు కొనసాగిస్తామన్నారు. ఈ33వ,రోజు కూడా వలస కార్మికులకు, రామకృష్ణటా కీస్‌, ‌రామాలయం, సుభ్రమణ్యం స్వామి టెంపుల్‌ ‌దగ్గర పేదలకు మొత్తం 3 చోట్ల దాదాపు 200 భోజన పాకెట్స్ అం‌దివ్వడం జరిగిందని తెలిపారు.భాజప కార్యాలయం దగ్గర మరో 100 మందికి నిత్యాన్న భోజనం వడ్డించడం వల్ల మొత్తం 300 మందికి ప్రయోజనం చేకూరిందని వివరించారు.

ఈ కార్యక్రమాల్లో ఎలిమెరాము, పట్టణఅధ్యక్షులు సలుకూటి యాదిరెడ్డి, కొండమోని మల్లీశ్వరీ శంకర్‌ ‌దంపతులు, తిమ్మాజిపేటలక్ష్మినారాయణ, లోహిత్‌ ‌రెడ్డి, సూరిబాబు, జమిస్తాపూర్‌ ‌రాజవర్ధన్‌ ‌రెడ్డి,శోభన్‌ ‌బాబు, మేస్త్రి శేఖర్‌, ‌నేషలక్ష్మయ్య బొట్టుశ్రీను,చిక్కొండ్రచందు, కె రాఘవేందర్‌, ‌క్యాసెట్‌ ‌రాజు, వీరాచారి, మోహన్‌ ‌మహరాజ్‌, ‌పెద్దబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!