Take a fresh look at your lifestyle.

మంత్రి ఎర్రబెల్లిపై బిజెపి మహిళా మోర్చా ఫిర్యాదు

సిద్దిపేట కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ప్రజాతంత్ర విలేఖరి): హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలోని కమలాపూర్‌ ‌లో జరిగిన అధికార కార్యక్రమంలో స్థానిక ఎంపిపి రాణి పై అమర్యాదగా ప్రవర్తించి, అవమానపరిచిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావుపై చర్యలు తీసుకోవాలని బిజెపి సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడి పల్లి అరుణ రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో సిద్దిపేటలో సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరుణ రెడ్డి మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న ఎంపిపిని అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించి స్టేజి పైకి రాకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

అంతకు ముందు కూడా మంత్రి దయాకర్‌ ‌రావు మహిళ అధికారి పట్ల కూడా చులకనగా మాట్లాడి అవమాన పరిచారని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో మహిళలకు ఉన్న స్థానం ఏంటో ఈ సంఘటనలు బట్టి అర్థమవుతుందన్నారు. ఇకనైనా మంత్రి దయాకర్‌ ‌రావు హుందాగా నడుచుకోవడం నేర్చుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు పద్మ, స్వరూప, ఉపాధ్యక్షురాళ్ళు లక్ష్మి, అనురాధ, కార్యదర్శి విజయ, పట్టణ ప్రధాన కార్యదర్శి బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply