Take a fresh look at your lifestyle.

బండి సంజయ్‌కు బీజేపీ నేతల పరామర్శ

అరెస్ట్ ‌చేసిన తీరుపై కిషన్‌ ‌రెడ్డి ఆరా
కరీంనగర్‌, ‌జనవరి 4 : జ్యుడిషియల్‌ ‌రిమాండ్‌లో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ను బీజేపీ నాయకులు పరామర్శించారు. కరీంనగర్‌ ‌జైలులో ఉన్న ఆయనతో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ ‌వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌భేటీ అయ్యారు. దాదాపు అర గంట పాటు బండి సంజయ్‌తో సమావేశమయ్యారు. జాగరణ కార్యక్రమం సమయంలో అరెస్టు చేసిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆయనను అడిగి తెలుసుకున్నారు. తదుపరి బండి సంజయ్‌ ‌కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సాయంత్రం హైదరాబాద్‌ ‌రానున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టులో నడ్డాకు బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు.

బండి సంజయ్‌ అరెస్టు, తర్వాత పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి జేపీ నడ్డా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం.. సికింద్రాబాద్‌ ‌లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్‌ ‌సర్కిల్‌ ‌వరకు కొవ్వొత్తుల ర్యాలీలో నడ్డా పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్త నిరసనలు ఇకపోతే, బండి సంజయ్‌ అరెస్ట్ ‌తో రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ నాయకత్వం పిలుపునిచ్చింది. 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని నేతలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply