Take a fresh look at your lifestyle.

మోదీ ముందు మాట్లాడే దమ్ము బిజెపి నేతలకు లేదు

బెంగళూరు,జనవరి4 :  కర్ణాటక బిజెపి నేతలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సిద్ధరామయ్య కుక్కపిల్లలతో పోల్చారు. వీరంతా మోడీముందు తోక ఆడించే వారేనని అన్నారు.ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మైతోపాటు స్థానిక బీజేపీ నాయకులపైన సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం బొమ్మైతోపాటు వాళ్లంతా ప్రధాని నరేంద్రమోదీ ముందు కుక్కపిల్లల లాంటివాళ్లేనని వ్యాఖ్యానించారు.

మోదీ ముందు వాళ్లంతా గడగడ వణుకుతారని ఎద్దేవా చేశారు.కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్ ‌కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసిందని, అయినా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ ‌నిధులను ఇప్పటివరకు సమకూర్చలేదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ముందు ప్రస్తావించడానికి బీజేపీ ముఖ్యమంత్రికిగానీ, ఇతర నేతలకుగానీ దమ్ములేదని విమర్శించారు.

Leave a Reply