Take a fresh look at your lifestyle.

మల్లన్నసాగర్‌ ‌భూ నిర్వాసితుల గోడు పట్టదా?

  • ప్లాట్ల దందాలకు బంధాల్ని తెంచేస్తున్న దౌర్భాగ్యులకు పుట్టగతులుండవ్‌…
  • ‌టిఆర్‌ఎస్‌పై బిజెపి నేత విజయశాంతి ఫైర్‌

‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 21 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో ఫైర్‌ అయ్యారు. సిఎం కేసీఆర్‌ ‌సర్కార్‌ ఎం‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ‌మల్లన్నసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌ప్రారంభానికి రెడీ అయినా మల్లన్నసాగర్‌ ‌నిర్వాసితుల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదనీ విజయశాంతి మండిపడ్డారు. సోమవారం ఆమె ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ… రిజర్వాయర్‌ను ఈ నెల 23న సిఎం కేసీఆర్‌ ‌చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారనీ, నిర్వాసితుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

 

- Advertisement -

ఆఫీసర్ల మాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన  కుటుంబాలు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయనీ,  ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన ఆఫీసర్లు… ఆ తరువాత వారి సమస్యలను గాలికి వదిలేశారన్నారు. మల్లన్నసాగర్‌ ‌రిజర్వాయర్‌తో 8 పంచాయతీల్లోని దాదాపు 6,533 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయనీ,  రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయడం కోసం ఒక్కో గ్రామాన్ని విడతలవారీగా పలు హామీలిస్తూ… ఆఫీసర్లు తరలించారన్నారు. దాదాపు 22 నెలల క్రితం లక్ష్మాపూర్‌ ‌గ్రామ నిర్వాసితులను తరలించగా… 8 నెలల క్రితం చివరిగా బ్రాహ్మణ బంజేరుపల్లి నిర్వాసితులను తరలించారు.

 

ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించేటప్పుడు వారి ఆప్షన్ల మేరకు కొందరికి డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను కేటాయించగా మరికొందరికి ఓపెన్‌ ‌ప్లాట్లను ఇవ్వడానికి హామీ ఇచ్చారనీ గుర్తు చేస్తూ… దాదాపు ఏడాది కావస్తున్నా… 3500 కుటుంబాలకు అటు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను గానీ, ఇటు ఓపెన్‌ ‌ప్లాట్లను గానీ ఇవ్వలేదన్నారు. నిర్వాసితులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తూ… ఆవేదనతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇద్దరు ఆడ పిల్లలున్న రాజబాబు అనే నిర్వాసితుడు ఏడాది క్రితం ప్యాకేజీ అందక ఆవేదనకు లోనై గుండెపోటుతో మరణించారనీ, ఆరు నెలల క్రితం బానోతు హన్మంతు అనే నిర్వాసితుడు చనిపోగా, ఒంటరి మహిళల ప్యాకేజీ అందక వేములఘాట్‌ ‌గ్రామానికి చెందిన ఎనబై ఏళ్ల వృద్ధురాలు బాలవ్వ ఆత్మహత్య చేసుకుందన్నారు. భవిష్యత్తు ఆశలపై నీళ్లు జల్లిన ఈ పాలక రాబందుల కారణంగా ఊరికాని ఊరిలో తనువు చాలించిన అభాగ్యుల ఉసురు ఊరికనే పోదనీ,  ప్లాట్ల దందాల కోసం నిర్వాసితులకు వారి గ్రామాలతో శాశ్వతంగా బంధాల్ని తెంచేస్తున్న దౌర్భాగ్యులకు పుట్టగతులు ఉండవనీ ఆ ప్రకటనలో విజయశాంతి హెచ్చరించారు.

Leave a Reply