Take a fresh look at your lifestyle.

సిఎం కేసీఆర్‌ ‌పర్యటన తీరేందో తెలంగాణకు తెల్వకుంది : విజయశాంతి

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి పార్టీ సీనియర్‌ ‌నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీనటి మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వందలాది కుటుంబాలను కలిసేందుకు గత ఏడేండ్లుగా  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  ఒక్కటంటే ఒక్క రోజు కూడా టైం దొరకలేదు. ఆత్మహత్యలు చేసుకున్న వేలాది రైతుల, నిరుద్యోగుల కుటుంబాలను చూడటానికి  ఒక్క దినం దొరకదు. ఏవో రెండు మూడు గ్రామాలను దత్తత తీసుకున్నాననీ, చెబుతూ నెలకు రెండు సార్లు వెళ్లిన చోటికే మల్లా మల్లా పర్యటనలు. ఆ ఊర్లకే మొత్తం అధికార యంత్రాంగం ఉరుకులు. ఈ తీరేందో తెలంగాణ మొత్తానికి తెల్వకుందన్నారు.

ఈ మేరకు విజయశాంతి సోషల్‌ ‌మీడియా ద్వారా ఓ పోస్టు చేస్తూ… సిఎం కేసీఆర్‌  ‌జ్ఞాపకశక్తి కోల్పోయి, చేసిన పర్యటనలే మల్లా మల్లా చేస్తున్నారా..?లేక హుజురాబాద్‌ ఉప ఎన్నికల దృష్ట్యా గత హామీలను అమలు చేస్తాననీ చెప్పేందుకు  కొత్త మోసాల హామీలతో వోటర్లను బోల్తా కొట్టించడానికి  ఈ కార్యక్రమం నడుపుతున్నారా? అసలు ఒక ముఖ్యమంత్రి 3 ఊళ్లు దత్తత తీసుకున్నారంటే, మిగతా తెలంగాణలోని వేలాదిపైన గ్రామాలతో వారికి సంబంధం లేదనీ, తను వాటి బాధ్యత తీసుకోలేదని చెప్పడం కాదా? మొత్తం తెలంగాణకు సిఎంగా ప్రమాణం చేసి, నేను 3 ఊళ్ల అభివృద్ధికి మాత్రమే పరిమితమనే ధోరణిల ఈ ముఖ్యమంత్రి  వ్యవహరించడం సబబుగా లేదన్నారు. అయినా, ఈ ముఖ్యమంత్రి  ఇప్పటికే దోచుకున్న లక్ష కోట్లు బయటకు తీస్తే, తెలంగాణలో ఒక్కో ఉమ్మడి జిల్లాకు కనీసం 200 గ్రామాలు దత్తత తీసుకోవచ్చు. లేదా మొత్తం తెలంగాణలో సగం దళిత బంధు నిధులు ఇప్పటికిప్పుడే ఇయ్యొచ్చనీ విజయశాంతి ఆ పోస్టులో పేర్కొన్నారు.

Leave a Reply