Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌కు సోయి లేదా?: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

పార్లమెంటు ఆమోదించిన బిల్లును వ్యతిరేకిస్తారా?: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై సీఎం కేసీఆర్‌ ‌సోయి లేకుండా మాట్లాడు తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె,లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. పార్ల మెంటో ఆమోదం పొందిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. సోమవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఇప్పటి వరకు 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే మేధావి కేసీఆర్‌ ‌భారత రాజ్యాంగాన్ని చదువలేదా అని ప్రశ్నించారు. డా.అంబేద్కర్‌ ‌రచించిన భారత రాజ్యాంగంలో కేంద్రం,రాష్ట్రాలు విడివిడిగా చట్టాలు చేసుకోవచ్చని ఉందనీ, అయితే, కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే విషయం సీఎం కేసీఆర్‌కు తెలియకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు.

 

ప్రఖ్యాత న్యాయశాస్త్ర నిపుణుడు కపిల్‌సిబాల్‌ ‌సైతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసిన చట్టాలను వ్యతిరేకించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పిన విషయాన్ని సీఎం కేసీఆర్‌ ‌గుర్తుంచుకోవాలని సూచించారు. సీఎం కసీఆర్‌ ‌కేవలం ఎంఐఎం అధినేత ఒవైసీ మెప్పు కోసమే సీఏఏను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ‌దేనికోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, అప్ఘనిస్తాన్‌ ‌దేశాలలో మత వివక్షకు గురైన వారిని చేరదీసి వారికి ఆశ్రయం కల్పించడమే సీఏఏ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. సీఎం కసీఆర్‌ ఆదివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఎన్‌పీఆర్‌ ‌గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల వివరాలను గణాంకాల రూపంలో సేకరించిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు కేంద్రం దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాల సేకరణకు చట్టం చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.  కేంద్ర ప్రభుత్వం మత వివక్ష ప్రదర్శిస్తోందని విమర్శించే నైతిక హక్కు సీఎం కేసీఆర్‌కు లేదని స్పష్టం చ•శారు. కేసీఆర్‌కు నిజంగా దమ్ముంటే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సవాల్‌ ‌విసిరారు. దేశంలో నివసిస్తున్న అన్ని మతాలు, వర్గాల వారికి సమాన భద్రతతో పాటు జీవించే హక్కును కల్పిస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కిందని స్పష్టం చేశారు. ఒవైసీ ఒత్తిడికి లొంగి సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామంటే కుదరదనీ, సీఎం కేసీఆర్‌, ఒవైసీ ఇద్దరూ కలసి రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనీ, దీనికి ఇటీవల భైంసాలో జరిగిన ఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఒవైసీ మెప్పుకోసం పాకులాడకుండా సీఏఏను వ్యతిరేకించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు బీజేపీ బాధ్యత వహించాలన్న టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఈ సందర్భంగా డా.లక్ష్మణ్‌ ‌డిమాండ్‌ ‌పేర్కొన్నారు.

 

Leave a Reply