Take a fresh look at your lifestyle.

రైతురుణమాఫీని అమలు చేయాలి

అగ్రికల్చర్‌ ‌కమిషనరేట్‌ ‌ముందు బిజెపి కిసాన్‌ ‌మోర్చా ఆందోళన
ఫసల్‌ ‌బీమా యోజన పథకం అమలుతో పాటు లక్ష రూపాయల రైతు రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్‌ ‌మోర్చా ఆందోళన నిర్వహించింది. 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేయక పోవడంతో రైతులు హైదరాబాద్‌ అ‌గ్రికల్చర్‌ ‌కమిషనరేట్‌ ‌కార్యాలయం వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. రైతులు చేపట్టిన ఆందోళనకు బీజేపీ కిసాన్‌ ‌మోర్చా మద్దతు ఇచ్చింది. కాగా.. ఈ కార్యక్రమంలో అపశృతి తలెత్తింది. రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో కిసాన్‌ ‌మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబశివరావు గాయపడ్డారు. కాలుకు తీవ్రమైన గాయం ఏర్పడింది.

మరికొంతమంది కార్యకర్తలు సైతం సొమ్మసిల్లి పడిపోయారు. బీజేపీ కిసాన్‌ ‌మోర్చా నాయకులు రైతులతో కలసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వి•డియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ‌రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు లక్ష రూపాలయ వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హావి•ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో అనేక ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతున్నారని… అందుకోసం రాష్ట్రంలో ఫసల్‌ ‌బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు.

ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణలో.. ఉద్యమాలను సహించలేనటువంటి పరిస్థితి కేసీఆర్‌ ‌ప్రభుత్వం చేస్తుందని నేతలు విమర్శించారు. తాము నిరసన ప్రారంభించకముందే పోలీసులు నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

Leave a Reply