Take a fresh look at your lifestyle.

బిజెపి సోషల్‌ ‌మీడియా పుకార్ల పుట్ట.. అబద్దాల గుట్ట

కాంగ్రెసోళ్లు కళ్లలో పసరు పోసుకుండ్రు…అందుకే అభివృద్ధి అగుపించడం లేదు
బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌

కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మండిపడ్డారు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటదట..  ఏమిలేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అట. సరిగ్గా ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలు అలాగే ఎగిరెగిపడుతున్నారు. కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు మీటింగ్‌ ‌పెడితే పరాయి లీడర్లు, కిరాయి మనుషులు వచ్చారనీ, కానీ, టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మహిళా లోకం, రైతులు ప్రతి ఒక్కరూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వైపు ఉన్నారన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దుబ్బాకలోని  దేవుని బాయిలో ఈత కొట్టి ఇక్కడే పెరిగిండు. ఇక్కడే చదువుకున్నాడు.

కేసీఆర్‌కు గల్లీ గల్లీ తెలుసు

చింతమడకలో పుట్టిండు. ఇక్కడి బీడీ కార్మికుల కష్టాలు తెలుసు. ఉత్తమ్‌, ‌బండి సంజయ్‌కు ఏం తెలుసు అని ప్రశ్నించారు.    దుబ్బాక ఎల్లలు తెలువని, తొవ్వ కూడా తెలియని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి, బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. అవాస్తవాలు మాట్లాడుతున్నారనీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.  బుధవారం దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డికి సంఘీభావంగా సుమారు 10వేల మంది మహిళలు భారీ ర్యాలీని నిర్వహించారు. దుబ్బాక ఆర్టీసీ బస్టాండ్‌ ‌నుంచి అంబేడ్కర్‌ ‌సర్కిల్‌ ‌మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలతో ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు మంత్రి హరీష్‌రావు కూడా పాల్గొన్నారు.

minister harees rao dubbaka campaign

ర్యాలీ అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ సోషల్‌ ‌మీడియా పుకార్ల పుట్ట.. అబద్దాల గుట్ట అని ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీల మాయలో పడొద్దని దుబ్బాక వోటర్లకు ఆయన పిలుపునిచ్చారు. దుబ్బాక ఈ జన సందోహాన్ని చూస్తుంటే సోలిపేట సుజాత విజయం ఖాయం అనిపిస్తోందన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ప్రతి ఒక్కరి మద్దతు ఉందన్నారు. దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు బీడీ కార్మికుల కష్టాలు తెలుసుకాబట్టే వారికి రూ. 2 వేల పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు.

బీడీ కార్మికుల పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌కు మరోసారి సవాల్‌ ‌విసురుతున్నా.. బీడీ కార్మికులకు కేంద్రం రూ. 1600 ఇస్తున్న మాట నిజమైతే.. దుబ్బాక పాత బస్టాండ్‌ ‌వద్దకు చర్చకు రావాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. దుబ్బాకకు బీజేపీ, కాంగ్రెస్‌ ‌చేసిందేమీ లేదన్నారు. దుబ్బాకలో ప్రభుత్వ ఆస్పత్రిని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. రూ. 18 కోట్లతో 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశామని చెప్పారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు తీరాయన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీకి వోటేస్తే మళ్లీ కరెంట్‌, ‌మంచినీటి కష్టాలు వస్తాయన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply