అవినీతి గద్దలను గద్దె దించాల్సిందే
కార్పోరేట్‌లకు దోచి పెడుతున్న మోడీ
ఎనిమిదేళ్లుగా దేశంలో ఒక్క మంచి పనీ చేయ లేదు
గుజరాత్ మోడల్ పేరుతో దేశాన్ని మోసం
మోడీకి వి•టర్ బింగించాల్సిన సమయం వొచ్చింది
జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రభంజనం సృష్టిస్తా
పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం సభలో కేంద్రం, మోడీపై కెసిఆర్ నిప్పులు
పెద్దపల్లి, ప్రజాతంత్ర, అగస్ట్ 29 : బిజెపి ముక్త భారత్ కావాలంటూ సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. దేశాన్ని కార్పోరేట్ గద్దలకు దోచి పెడుతున్న బీజేపీ అవినీతి గద్దలను గద్దె దించి.. వారి నుంచి ఈ దేశానికి విముక్తి పలుకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గత ఎనిమిదేళ్లుగా దేశానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేయకపోగా..దేశాన్ని దివాళా తీయిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీపై ప్రత్యక్ష దాడికి దిగారు. గుజరాత్ మోడల్ అని చెప్పి ఈ దేశాన్ని మోసం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లాలో సవి•కృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. పెద్దపల్లి జిల్లా అవుతుందని మనం కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి పెద్దపల్లిని జిల్లా చేసుకున్నాం. అద్భుతమైన కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని, ప్రజలందరినీ హృదయపూర్వంగా అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. పేదలు, రైతులు, ప్రజలు, మహిళలు గురించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. భారతదేశమే ఆశ్చర్యపోయే విధంగా.. అద్భుతమైన పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం గురించి వి•కు తెలుసు. సింగరేణిలో వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొరకుతున్నాయి. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తున్నాం. రామగుండం పట్టణాన్ని కార్పొరేషన్ చేసుకున్నాం. ఏ విధమైన కార్యక్రమాలు అమలవుతున్నాయో వి•కు తెలుసు అని కేసీఆర్ తెలిపారు. నిన్న గాక మొన్న 26 రాష్టాల్రనుంచి దాదాపు 100 మంది రైతు నాయకులు వచ్చారని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులను చూశాం. రైతులతో మాట్లాడం. ఈ రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు మా దగ్గర అమలు కావడం లేదు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని సభలో ఉన్న జనాలను కేసీఆర్ ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను ఈ మోదీ దగా, మోసం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. అడ్డగోలుగా ధరలు పెంచారు. స్మశానాల వి•ద పన్ను, పాలవి•ద జీఎస్టీ, చేనేత వి•ద జీఎస్టీ, పేద ప్రజలు ఉసురుపోసుకుంటూ.. లక్షల రూపాయాలు మేస్తూ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కొన్ని సన్నివేశాలు స్వయంగా చూస్తున్నాం. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేశామని చెప్తారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కల్తీ మద్యానికి 79 మంది బలయ్యారు. అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీని వి• సమాధానం ఏంటని అడుగుతున్నాను అని మోదీని ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పారద్రోలాలని పిలుపు నిచ్చారు. రైతులకు వి•టర్ పెట్టాలని అంటున్న ఈ మోదీకే వి•టర్ పెట్టాలన్నారు. రైతులకు మేలు చేస్తూ పేదలను ఆదుకుంటుంటే వాటిని ఉచితాలు అని బంద్ పెట్టాలని అంటున్నారు. ఉచిత కరెంట్ ఇస్తే వి•టర్ పెట్టాలని అంటున్నారు.
రేపు రాబోయే భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతుంది. ఈ గోల్ మాల్ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్దాల ఆడుతూ, దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. దేశంలోని మొత్తం వ్యవసాయానికి వాడే కరెంట్ కేవలం 20.8 శాతం మాత్రమే. దాని ఖరీదు ఒక లక్షా 45 వేల కోట్లు.ఓ కార్పొరేట్ దొంగకు దోచిపెట్టినంత కాదు కదా మోదీ. రైతుల కోసం వి•రు బయల్దేరండి అని ఆయా రాష్ట్రాల రైతులు నన్ను కోరారు. వి•టర్ లేని రైతు రావాలని కోరారు. భారతదేశం స్వాగతం పలుకుతుందన్నారు. రైతులకు వి•టర్ పెట్టాలని అంటున్న మోదీకి మనందరం కలిసి వి•టర్ పెట్టాలి. ఆ పని చేస్తే మనకు పీడ వోతది. ఏ ఒక్క రంగంలో కూడా దేశాన్ని బాగు చేసింది లేదు. అనేక రంగాల్లో అవినీతి నెలకొని ఉందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్,ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చందర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో రూ. 48కోట్లతో నిర్మించిన సవి•కృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు వచ్చారు. అనంతరం మంథని రోడ్డులో నిర్మించనున్న తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు.