Take a fresh look at your lifestyle.

సిద్ధాంతం లేని రాద్ధాంతం పార్టీ బీజేపీ

ప్రజల సమస్యలను పరిష్కరించేదే టీఆర్‌ఎస్‌ ‌పార్టీ
బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసింది ఏంటి?
కొరోనా కష్టకాలంలో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ధైర్యం ఇచ్చింది
:రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

ప్రజల సమస్యలను పరిష్కరించేదే టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఆదివారం పటాన్‌ ‌చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు  హాజరై, మాట్లాడుతూ ఈ రోజు ఆదివారం మలి దశ ఉద్యమ కారుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసిన రోజు అని అన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ ‌సచ్చుడో అని కేసీఆర్‌ ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు. ఆనాడు కేసీఆర్‌ ‌దీక్ష చేయక పోతే ఖమ్మం జైలుకు
వెళ్లకపోతే తెలంగాణ వచ్చేదా అని అన్నారు. ఒక వోటు రెండు రాష్ట్రాలు అని అధికారంలోకి వొచ్చిన బీజేపీ ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. 1200 మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్‌ ‌పార్టీ అని విమర్శించారు. సిద్ధాంతం లేని రాద్ధాంతం పార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కొరోనా కష్టకాలంలో ప్రజలకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.

ఆ నవంబర్‌ 29 ‌తెలంగాణను తెస్తే, ఈ నవంబర్‌ 29 ‌బంగారు హైదరాబాద్‌ ‌తీసుకొస్తుందని అన్నారు. ఇక్కడ గుజరాత్‌, ‌బీహార్‌ ‌రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అక్కడ ప్రభుత్వాలు ఎంత పెన్షన్‌ ఇస్తున్నాయో స్థానికులకు చెప్పాలని పేర్కొన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 4వందల పెన్షన్‌ ఇస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2‌వేలు ఇస్తున్నారని తెలిపారు. బీహార్‌ ‌లో భాజపా మూడు సార్లు అధికారంలో ఉన్న కనీస అభివృద్ధి చేయలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇళ్లకు 24 గంటల విద్యుత్‌ ఇచ్చామని తెలిపారు. కేసీఆర్‌ ‌హైదరాబాద్‌ ‌ను పునర్నిర్మిస్తాం అంటే ఒకరు పీవీ ఘాట్‌, ఎన్టీఆర్‌ ‌ఘాట్‌ ‌కూల్చుతా అని ఒకరు, ధారుస్సలాం కూల్చుతమని ఒకరు అంటున్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు తెచుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్‌ అం‌టే మత ఘర్షణలు సృష్టించాలని భాజపా చూస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు దెబ్బతీసి ఇక్కడికి వొచ్చే పెట్టుబడులు గుజరాత్‌, ‌ముంబైకి తరలించుకుపోవాలని చూస్తున్నాయని అన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపించడి, మీ నల్లా బిల్లు ప్రభుత్వమే కడుతుందని అన్నారు. మరో మూడు సంవత్సరాలు తెరాస నే అధికారంలో ఉంటుంది. కాళ్లు మొక్కుతున్న భాజపా వాళ్లు రేపు కాళ్లు లాగుతారని అన్నారు. కొరోనా వొచ్చినప్పుడు డాక్టర్లను తీసుకొని మీ ఇంటికి వచ్చినం. కొరోనా వస్తే ప్రతి రేషన్‌ ‌కార్డుకు 1500 ఇచ్చాం. మనిషికి 12కిలోల బియ్యం ఇచ్చాం.

పేదింటి బిడ్డ పెళ్లి ఐతే లక్ష రూపాయలు ఇస్తున్నాం అన్నారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని కూల్చుతాం అని భాజపా అంటుంది. తెరాస బంగారు తెలంగాణ అంటే, బీజేపీ కంగారు తెలంగాణ అంటుందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలో, కంగారు తెలంగాణ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. సెక్యూలర్‌ ‌ప్రభుత్వం కావాలంటే తెరాసకు ఓటు వేయాలి. ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌లో 12గంటలు పని చేయాలని అక్కడి భాజపా ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. తెలంగాణలో 8 గంటలే పని సమయం అన్నారు. భాజపా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంది. బీహెచ్‌ఈఎల్‌, ఓడిఎఫ్‌, ‌బీడీఎల్‌ ‌వంటి సంస్థల వల్ల పటాన్‌ ‌చెరు అభివృద్ధి చెందింది. వీటి ఆధారంగా అనేక అనుబంధ పరిశ్రమలు వచ్చాయని అన్నారు. వీటన్నిటి వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు కేసీఆర్‌ ‌మరో ఉద్యమం చేయబోతున్నారని అన్నారు. పండగల ముందు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్‌ 10 ‌వేల రూపాయలు ఇచ్చారు.

కేసీఆర్‌ ‌కు మంచి పేరు వస్తుందని భావించి భాజపా వీటిని అడ్డుకుందని తెలిపారు. 10 వేల రూపాయలు రాని వారికి ఎన్నికల తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అన్నారు. వెయ్యి రూపాయలు ఇస్తాం ఓటు వేయడానికి రావొద్దు అని భాజపా ముస్లింలకు చెబుతోంది. ప్రతి ముస్లిం ఓటు వేసి ఓటు వెయ్యొద్దు అన్నోళ్లకు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌లో ఎన్నికలు జరుగుతుంటే బీజేపీ నాయకులు ఇండియా, పాకిస్థాన్‌ ‌క్రికెట్‌, ‌బొంబాయి బాంబులు అంటున్నారు. నగరంపైన బీజేపీ నాయకులకు అవగాహనలేకే నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమానికి ముందు సభకు విచ్చేసిన ప్రజలకు సింగర్‌ ‌మంగ్లీ తెలంగాణ పాటలతో ఉత్తేజపరిచారు. పటాన్‌ ‌చెరు డివిజన్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి మెట్టు కుమార్‌ ‌యాదవ్‌కు కారు గుర్తుకు వోటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌ ‌రెడ్డి, ఫారుక్‌ ‌హుస్సేన్‌, ‌మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, చింత ప్రభాకర్‌, ‌పటాన్‌ ‌చెరు డివిజన్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి మెట్టు కుమార్‌ ‌యాదవ్‌, ‌గూడెం మధుసూదన్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply