Take a fresh look at your lifestyle.

దేశంలో బీజేపీ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తుంది: కాంగ్రెస్‌

దేశంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలను కూలదొస్తుందంటూ నిరసనగా టీ కాంగ్రెస్‌ ‌రాజ్‌ ‌భవన్‌ ‌ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గాంధీ భవన్‌ ‌నుంచి రాజభవన్‌ ‌బయలుదేరేందుకు కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు ప్రయత్నం చేశారు. పోలిసులు అనుమతించకపోవడంతో గాంధీ భవన్‌ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని కాంగ్రెస్‌ ‌నేతలు ఆరోపించారు. రాజ్‌ ‌భవన్‌ ‌ముట్టడికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ ‌చేసి బేగం బజార్‌ ‌పీఎస్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ హనుమంతరావు, గ్రేటర్‌ అధ్యక్షుడు అంజనకుమార్‌ ‌యాదవ్‌, ‌మల్లు రవి, యువజన తదితరులు పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ‌ప్రతినిధులు గవర్నర్‌ని కలిసేందుకు అనుమతి కోరుతూ లేఖ పంపారు. ఈ సందర్భంగా వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఎం‌పీ రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…బీజేపీ అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొని అక్కడ కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఇన్‌కమ్‌ ‌టాక్స్ అధికారులను ఉసిగొల్పి ప్రజాప్రతినిధులను భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 31 తేదీన అసెంబ్లీని ఏర్పాటు చేయాలని బీజేపీ విధానాలపై శాసన సభలో చర్చించాలని డిమాండ్‌ ‌చేశారు.

రాజ్‌ ‌భవన్‌ ‌ముందు ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన  
ఏఐసీసీ పిలువు మేరకు బీజేపీ సర్కర్‌ ‌రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసనలు చేసింది. ఈ సందర్బంగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సోమాజిగూడ లోని రాజ్‌ ‌భవన్‌ ‌ముందుకు వెళ్లి బీజేపీ ప్రభుత్వ తీరు పై నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్‌ ‌స్టేషన్‌కి తరలించారు. బీజేపీ అవలంబిస్తున్న తీరుని జగ్గారెడ్డి ఖండించారు.తెలంగాణలో కోవిడ్‌ ‌మరణాల తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు..ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ ‌రెడ్డి ఐసిఎమ్‌ఆర్‌ ‌మార్గదర్శకాలను విస్మరిస్తున్న ప్రభుత్వం : గవర్నర్‌కు చల్లా వంశీచంద్‌ ‌రెడ్డి లేఖ
కోవిడ్‌ ‌పరీక్షలలో, కొరోనా నివారణలో విఫలమై హైకోర్టుతో చివాట్లు తిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ ‌మరణాలను దాస్తు తప్పుడులెక్కలు చూపిస్తున్నాయని కాంగ్రెస్‌ ‌నేత, మాజీ ఎమ్మెల్యే వంశీ చాంద్‌ ‌రెడ్డి విమర్శించారు. ఈ అంశంపై ఆయన రాష్ట్ర గవర్నర్‌కు లేఖ  రాశారు. సోమవారం ఆయన వీడియోలో మాట్లాడుతూ …కోవిడ్‌ ‌మరణాల తప్పుడు లెక్కల నమోదు ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఐసిఎమ్‌ఆర్‌ ‌మార్గదర్శకాలను పూర్తిగా తుంగలో తొక్కుతుందన్నారు.

కోవిడ్‌ ‌మరణాల నమోదుపై ఐసిఎమ్‌ఆర్‌ ‌విడుదల చేసిన మార్గదర్శకాలలో సెక్షన్‌ 2.4 ‌లో చాలా స్పష్టంగా ఉందని ప్రతీ కోవిడ్‌19 ‌పోసిటివ్‌ ‌మరణాన్ని నమోదుచేయడం యొక్క ప్రాముఖ్యాన్ని వివరించారని తెలిపారు. ఈ లెక్కల ఆధారంగానే ప్రపంచంలో కోవిడ్‌ ‌లక్షణాలు, వ్యాప్తి, నివారణ, నియంత్రణ, చికిత్సపై అధ్యయనాలు జరుగుతాయని పేర్కొన్నారు. మరణానికి ప్రాథమిక కారణం కొరోనా కాకపోయినా, కోవిడ్‌19 ‌సోకిన ప్రతీ వ్యక్తి మరణాన్ని నమోదుచేయాలని ఐ.సి.ఎమ్‌.ఆర్‌ ‌మార్గదర్శకాలలో సెక్షన్‌ 3 ‌లో స్పష్టంగా ఉందన్నారు. వాటిని ప్రభుత్వం విస్మరిస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజుకు దాదాపు వందల సంఖ్యలో కొరోనా మరణాలు సంభవిస్తుంటే కేవలం 10లోపే చూపుతున్నారని ఆరోపించారు. కేవలం హైద్రాబాద్‌ ‌లొనే రోజూ 50 మృతదేహాలను రహస్యంగా దహనం చేస్తున్నారని పేర్కొన్నారు. గుట్టు చప్పుడు కాకుండా కోవిడ్‌ ‌మరణాలను దాయటం, మృతదేహాలను దహనం చేయడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ‘‘డాక్టర్స్ ‌ఫర్‌ ‌సేవ’’ లాంటి అనేక సంస్థలేకాక, వివిధ వార్తా పత్రికలు, ఛానెళ్లు, మరణించిన వ్యక్తుల బంధువులు అనేక రుజువులు బహిర్గతం చేశారని, అయినా ప్రభుత్వం పారదర్శకత చూపకపోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎలాగూ స్పందించరు కాబట్టి, ఐసిఎమ్‌ఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌19 ‌మరణాల నమోదు జరి•గేటట్టు ఆదేశాలు జారిచేయాలని ఆయన గవర్నర్‌ను కోరారు.

Leave a Reply