Take a fresh look at your lifestyle.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కృషి

  • గత ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలను దూరంగా పెట్టేవి
  • గౌహతిలో ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఈశాన్య రాష్ట్రాలకు గత ప్రభుత్వాలు చాలా దూరంగా ఉండేవని, వాటిని దగ్గరకు చేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  చెప్పారు. ఆయన శుక్రవారం అస్సాంలో బిహు ఉత్సవాల్లో పాల్గొనడంతోపాటు గువాహటిలో అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ  ఎయిమ్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూ.14,300 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గువాహటి బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, రొంగలి బిహు పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సందర్భంలో ఈశాన్య రాష్టాల్రు, అస్సాంలో వైద్య, ఆరోగ్య సదుపాయాలు నూతన బలాన్ని సంతరించు కున్నట్లు తెలిపారు. నేడు ఈశాన్య రాష్టాల్రకు మొట్టమొదటి ఎయిమ్స్ ‌వచ్చిందని, అస్సాంకు మూడు వైద్య కళాశాలలు వచ్చాయని తెలిపారు. ఈశాన్య రాష్టాల్రకు గత ప్రభుత్వాలు చాలా దూరంగా ఉండేవని, వాటిని అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందని చెప్పారు. ఈశాన్య రాష్టాల్ల్రో తొమ్మిదేళ్ల నుంచి జరుగుతున్న అభివృద్ధి గురించి తాను మాట్లాడినప్పుడల్లా, కొందరు ఆందోళనకు గురవుతున్నారన్నారు.

అస్సాంలో అభివృద్ధి ఘనత తమకు రావడం లేదని వారు ఆవేదన చెందుతున్నా రన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి ఎయిమ్స్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. దీనిని రూ.1,123 కోట్ల వ్యయంతో నిర్మించారు. అదేవిధంగా నల్బరి వైద్య కళాశాల, నాగావ్‌ ‌వైద్య కళాశాల, కోక్రజర్‌ ‌వైద్య కళాశాలలను వర్చువల్‌ ‌విధానంలో మోదీ ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రి అస్సాం ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ఈశాన్య రాష్టాల్రకు కూడా వైద్య సేవలను అందిస్తుందన్నారు. మోదీ ప్రారంభించిన మూడు వైద్య కళాశాలల్లో 500 పడకలు ఉన్నాయి. వీటిలో 24 అండర్‌‌గ్రాడ్యుయేట్‌ ‌డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ కళాశాలలు సంవత్సరానికి 100 మంది ఎంబీబీఎస్‌ ‌విద్యార్థులను చేర్చుకుంటాయి. దీంతో అస్సాంలో మొత్తం ఎంబీబీఎస్‌ ‌విద్యార్థుల సంఖ్య 1,500 అవుతుంది.

Leave a Reply