Take a fresh look at your lifestyle.

రాబోయేది బిజెపి ప్రభుత్వమే

కాంగ్రెస్‌ ‌పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు
బిజెపిలో లుకలుకలు కేవలం వి•డియా సృష్టి
బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఎంపి ధర్మపురి అర్వింద్‌
‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం బిజెపి నిజామాబాద్‌ ఎం‌పీ అర్వింద్‌ ‌చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌తో యుద్దానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవని.. ఇదంతా కేవలం వి•డియా సృష్టేనని  రాష్ట్ర బీజేపీపై వస్తున్న విమర్శల స్పందించారు. వాటిని అర్వింద్‌ ‌కొట్టిపారేశారు. నవీపేటలో జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అర్వింద్‌ ‌మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.షకీల్‌.. ‌బోధన ఎమ్మెల్యేగా ఉండటం వల్ల అసాంఘిక శక్తులకు అడ్డగా మారిందని ఆరోపించారు. ఇందూర్‌.. ‌దేశ ద్రోహులకు అడ్డగా మారిందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌, ‌జిల్లా మంత్రి, ఎమ్మెల్సీ కవిత, బోధన ఎమ్మెల్యే షకీల్‌.. ‌దేశ ద్రోహులకు వత్తాసు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు.

జిల్లాను దేశ ద్రోహులకు అడ్డాగా మార్చడం దురదృష్టకరం అని అర్వింద్‌ ‌ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటు న్నారని ఎంపి తెలిపారు. దేశాన్ని మోడీ ఎంతో అభివృద్ధి  చేశారని మరి తెలంగాణను కేసీఆర్‌ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు మహాజన్‌ ‌సంపర్క్ అభియాన్‌ ‌కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నామని చెప్పారు. మహాజన్‌ ‌సంపర్క్ అభియాన్‌ అం‌టే ప్రజలను కలిసే సమావేశమన్నారు. దళిత ముఖ్యమంత్రి, దళితబంధు పేరుతో ప్రజలను కెసిఆర్‌ ‌మోసం చేశారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేయని అవినీతి లేదన్నారు. బీజేపీ మాత్రమే సమర్థవంతమైన పాలన అందిస్తుందని స్పష్టం చేశారు. మోదీ ఏ దేశానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. ప్రపంచ దేశాలు ప్రధాని మోదీకి బ్రహ్మరథం పడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. పార్లమెంటు కొత్త భవనాన్ని మోదీ ప్రారంభించబోతుంటే ప్రతిపక్షలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌సహా ప్రాంతీయ పార్టీలు అనవసరంగా విమర్శలు చేస్తున్నాయన్నారు. మోదీపై విమర్శలు చేస్తే అభాసుపాలు అవుతామన్న సంగతి గమనించలేక పోతున్నారని తెలిపారు. ఇక తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ను కేసీఆర్‌ ఆహ్వానించలేదని ఎంపి గుర్తుచేశారు. ఇవన్నీమరచిన విపక్షాలు విమర్శలు చేయడం సిగ్గు  చేటన్నారు.కేసీఆర్‌ ‌కుటుంబ పాలనను అంతం చేయాడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply