Take a fresh look at your lifestyle.

‘వికాస్’ కాదు ‘వసూలి’..!

మహారాష్ట్ర సర్కార్ పై బీజేపీ దాడి ముమ్మరం
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాది (ఎంవిఎ) ప్రభుత్వంపై తన దాడిని ముమ్మరం చేస్తూ బీజేపీ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి డిమాండ్ చేసింది. రవిశంకర్ ప్రసాద్ మంగళవారం మహా వికాస్ అగాడి (ఎంవిఎ) ప్రభుత్వంపై విరుచుకుపడి, ‘మహారాష్ట్రలో ఏమి జరుగుతుందో అది’ వికాస్ ‘(అభివృద్ధి) కాదు, ‘వసూలి ‘(దోపిడీ) అని అన్నారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలపై వివాదాల నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ‘ఖేల్’ ఆట జరుగుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. “మహారాష్ట్ర ప్రభుత్వం ‘వసూలి ప్రభుత్వం అని అది వసూలి ద్వారా..వసూలి కోసం..నడుస్తున్నది అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం మహారాష్ట్రను పాలించే నైతిక అధికారాన్ని కోల్పోయిందని మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. శరద్ పవార్‌పై కూడా విరుచుకు పడుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత పవర్ రాజకీయ విశ్వసనీయత దెబ్బతింది అని అన్నారు. శనివారం, ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బిర్ సింగ్ ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాశారు అందులో మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ‘దుష్ప్రవర్తన’కు పాల్పడ్డారని ఆరోపించారు. సస్పెండ్ చేసిన ఎపిఐ సచిన్ వాజ్ ను ప్రతి నెల బార్లు పబ్బుల నుంచి 100 కోట్లు వసూలు చేయాలని పురమాయించారు అని ఆరోపణలు చేసారు.మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఎన్‌సిపి కి చెందిన నాయకుడు అంచేత పవర్ కూడా ఇరకాటంలో పడ్డ పరిస్థితి మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Leave a Reply