Take a fresh look at your lifestyle.

రైతు బంధు పథకం అమలు చేయాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతు సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం అమలు చేయాల్సిందేనని బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో సత్యనారాయణ, బిజెపి నాయకులతో జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సోమారపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ ‌నియంత్రిత సాగు విధానం తీసుకువచ్చి, తాము చెప్పిన పంటను సాగు చేస్తేనే రైతులకు రైతు బంధు పథకం కింద లబ్ది జరుగుతుందని, లేకపోతే పథకం వర్తించదని బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సిఎం కెసిఆర్‌ ‌రెండో సారి అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్న రైతు ఋణమాఫీ చేయలేదని నిప్పులు చెరిగారు. 2018 ఎన్నికల్లో కెసిఆర్‌ ‌చేసిన వాగ్దానం మేరకు లక్ష రూపాయల రైతు ఋణాలను తక్షణమే మాఫీ చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఎకరానికి రూ.5వేలు రైతు బంధు పథకం ఇవ్వాల్సిందేనన్నారు. కొంత మంది మిల్లర్లు ఐకెపి కొనుగోళు కేంద్రాల్లో అక్రమంగా రైతుల వద్ద ధాన్యాన్ని కటింగ్‌ ‌పేరుతో తీసుకుంటున్నారని దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం దగ్గర పడినందున ధాన్యం కొనుగోళ్ళను వెంటనే పూర్తి చేయాలని సత్యనారాయణ డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ ‌కుమార్‌, ‌జిల్లా మాజీ పార్లమెంట్‌ ‌కన్వీనర్‌ ‌ఠాకూర్‌ ‌రాంసింగ్‌, ‌కిసాన్‌ ‌సెల్‌ ‌రాష్ట్ర అధికార ప్రతినిధి తంగెడ రాజేశ్వర్‌ ‌రావు, నాయకులు రావుల రాజేందర్‌, ‌పిడుగు కృష్ణ, పర్ష సమ్మయ్య, రాజన్న పటేల్‌, ‌ముంజ రాజేంద్ర ప్రసాద్‌, ‌దాడి సంతోష్‌, ‌పుట్ట రవి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పోల్సాని సంపత్రావుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు .

Leave a Reply