Take a fresh look at your lifestyle.

కొనసాగుతున్న బిజెపి భోజనం పంపిణీ

జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భోజనాలు పంపిణీ కార్యక్రమం సోమవారం23వరోజు కొనసాగింది. ఈసందర్భంగా బిజెపి పార్లమెంట్‌ ‌కన్వీనర్‌ ‌బుసిరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని నిరోధించే ఏకైక మార్గం లాక్‌ ‌డౌన్‌ ఒక్కటే కాబట్టి దేశం యావత్తు ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశంలోని ప్రజలంతా తమ పనులన్నీ వదిలిపెట్టి ఇంటికే పరిమితమయ్యారని అన్నారు. ఈ కారణంగా పేదలను వలస కార్మికులను ఆదుకునే బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ రాష్ట్ర నేతల పిలుపు మేరకు నాగర్‌ ‌కర్నూల్‌ ‌లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర అసెంబ్లీ ఇన్చార్జి నెడునూరి దిలీపాచారి సూచనల మేరకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం వండి మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలు, గ్రామాలకు తీసుకొని వెళ్లి 22 రోజులుగా పేదలకు కార్మికులకు ఇవ్వడం జరుగుతున్నదని అన్నార్ను.

23వ రోజు సోమవారం కూడా రామాలయం, అంబేద్కర్‌ ‌కాలనీ,వివిధ కార్యాలయాల దగ్గర పేదలకు భోజన పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఇదిలా వుండగా బిజెపి నాయకులు చేపడుతున్న భోజనాల పంపిణీ, నిత్యావసర సరుక్నుల పంపిణీ, మా స్క్నులు పంపిణీ, సాని టేజర్ల పంపిణీ, కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తూ, ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్లమెంట్‌ ‌కన్వీనర్‌ ‌బుసిరెడ్డి సుధాకర్‌ ‌రెడ్డి, జిల్లా నాయకులు దొడ్ల రాధా రాజ వర్ధన్‌ ‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు సలుకూటి యాదవ రెడ్డి, నాయకులు ఎలిమె రాము, రాజేశ్వర్‌ ‌రెడ్డి, మేస్త్రి శేఖర్‌, ‌వారధి శ్రీనివాసులు, నేష లక్ష్మయ్య, చిక్కొండ్ర చందు, వీరాచారి, తిరుపతి రెడ్డి, భీమయ్య,మోహన్‌ ‌మహారాజ్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!