Take a fresh look at your lifestyle.

నేడు గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష

  • కొరోనా కట్టడికి కేంద్రం కృషి
  • తప్పుడు లెక్కలు చూపుతోన్న కెసిఆర్‌ ‌సర్కార్‌
  • ఆయుష్మాన్‌ ‌భారత్‌ను పట్టించుకోని ప్రభుత్వం
  • ఘాటుగా విమర్శించిన బిజెపి నేతలు  

దేశంలో కొరోనా కట్టడికి కేంద్రం అహర్నిశలు శ్రమిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ అన్నారు. మంగళవారం అరుణ డియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిందే తడవుగా ఎలాంటి సాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. కొరోనా కేసులు, మరణాలు విషయంలో తెలంగాణ తప్పుడు లెక్కలు చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా  ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్‌, ‌రెమ్‌డెసివిర్‌, ‌వెంటిలేటర్లను భారీగా అందజేసిందన్నారు. పేదలకు కొవిడ్‌ ‌చికిత్స భారం నుంచి రూ.5 లక్షల వరకు  అందించే ఆయుష్మాన్‌ ‌భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.రాష్ట్రంలో ఆయుష్మాన్‌ ‌భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీలో కొరోనా చేర్చాలన్న డిమాండ్‌తో నేడు జరిగే ‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష‘ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఎవరింట్లో వాళ్లు కొవిడ్‌, ‌లాక్‌డౌన్‌ ‌నిబంధనలకు లోబడి దీక్ష చేయాలని తెలిపారు. డియా, సోషల్‌ ‌డియా, వర్చువల్‌ ‌డియా ద్వారా దీక్షను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని  డీ.కే.అరుణ పేర్కొన్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్‌ ‌గాలికి వదిలేశారని మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు. మంగళవారం డియాతో మాట్లాడుతూ ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్‌ ‌చికిత్స ఫీజులపై నియంత్రణ లేదన్నారు. పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కొరోనా బాధితుల హాహాకారాలు వినిపించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ ‌భారత్‌ అమలు చేసి ఉంటే కొరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు.

ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందన్నారు. తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్‌ ఆయుష్మాన్‌ ‌భారత్‌ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయూష్మాన్‌ ‌భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కొరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో  బుధవారం జరగబోతున్న ‘ గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష‘ ను విజయవంతం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు. కొరోనా బారిన పడి రాష్ట్రంలో  ప్రజలు వేలల్లో చనిపోతున్నారని  బీజేపీ సీనియర్‌ ‌నేత రాజాసింగ్‌ అన్నారు.

మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. లక్షల మంది కొరోనా బాధిత కుటుంబాలు హాస్పిటల్‌ ‌ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఆయుష్మాన్‌ ‌భారత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవడంతో రాష్ట్ర ప్రజలు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయడం లేదన్నారు. సర్కార్‌ ‌హాస్పిటళ్లకు పోలేక, ప్రైవేటు హాస్పిటల్‌ ‌ఫీజులు చెల్లించలేక కొరోనా బాధితులు ప్రాణాలు వదులుతున్నారన్నారు.

Leave a Reply